Shocking News: మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు.. ప్రూఫ్స్ చూపించడంతో..
మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఓ ఆకర్షణీయమైన ప్రకటన. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, బేబీ బర్త్ సర్వీస్ అంటూ పేర్లు. చాలా మంది అలా డబ్బు సంపాదించారంటూ ప్రూఫ్స్‌తో సహా చూపిస్తే..
మహిళలను గర్భవతులను చేస్తే రూ.10 లక్షలు ఇస్తామంటూ ఓ ఆకర్షణీయమైన ప్రకటన. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్, బేబీ బర్త్ సర్వీస్ అంటూ పేర్లు. చాలా మంది అలా డబ్బు సంపాదించారంటూ ప్రూఫ్స్‌తో సహా చూపిస్తే ఆగుతారా? ఆసక్తి ఉన్న వ్యక్తులు హోటల్ బుకింగ్‌లు , డాక్యుమెంటేషన్ , రిజిస్ట్రేషన్ ఫీజు , అదనపు ఛార్జీలు చెల్లించాలని కోరారు. అక్షరాలా పది లక్షలు వస్తున్నప్పుడు ఇవన్నీ ఒక లెక్కా అని లెక్కలేనంత మంది డబ్బు చెల్లించారు. కట్ చేస్తే మోసపోయామని తెలిసి షాక్ అయ్యారు.
ప్లేబాయ్ సర్వీస్ పేరుతో పురుషులే టార్గెట్‌గా బీహార్‌కు చెందిన ఓ ముఠా భారీ సైబర్ స్కామ్‌కు పాల్పడింది. తాము మోసపోయామని తెలుసుకున్న కొందరు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు రట్టైంది. ఈ ముఠాలో ఒక మైనర్ కూడా ఉండటం గమనార్హం. మైనర్ సహా ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలులేని మహిళలను గర్బవతిని చేస్తే.. వారికి రూ.10 లక్షలు ఇస్తామని.. ఇలా ఇప్పటికే చాలా మంది డబ్బులు సంపాదించారని ప్రూఫ్‌లతో సహా బాధితులకు చూపించారట. అంతేకాకుండా ఒకవేళ మహిళలను గర్భవతిని చేయకున్నా కూడా రూ.5 లక్షలు ఇస్తామని ఆశ చూపించడంతో వెనుకా ముందూ ఆలోచించకుండా హోటల్ బుకింగ్‌లు , డాక్యుమెంటేషన్ , రిజిస్ట్రేషన్ ఫీజు , అదనపు ఛార్జీలు సదరు ముఠా అడిగినంత డబ్బును ముట్టజెప్పారు.
ఇవన్నీ చెల్లించినా కూడా వారిని వదిలేశారా? మెడికల్ టెస్ట్‌లు, అకామిడేషన్, ఐటెండిటీ ఫీజులు వంటి కారణాలను చెప్పి బాధితుల నుంచి గట్టిగానే డబ్బు గుంజారు. మోసపోయామని తెలుసుకున్నా కూడా బాధితులు బయట పెట్టలేరని.. పరువుకు భయపడి ఆగిపోతారని భావించారు. వారు అనుకున్నట్టుగానే కథ నడిచింది కానీ ఒకరిద్దరు పోలీసులు ఆశ్రయించేసరికి డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు విచారణ మొదలు పెట్టి నవాడ సైబర్ పోలీసులకు విస్తుబోయే నిజాలు తెలిశాయి. ఇప్పుడే కాదు.. గతేడాది కూడా ఇదే నవాడ జిల్లాలో ఇలాంటి స్కామే బయటపడింది.