Entertainment

IBomma Ravi: ఐబొమ్మ రవి పోలీసులకు ఎలా దొరికిపోయాడో తెలిస్తే..

ఇక అసలు ఇమంది రవి ఎలా అరెస్ట్ అయ్యాడన్నది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. పోలీసులకే సవాల్ విసిరిన రవిని పట్టుకునేందుకు పోలీసులు గట్టి స్కెచ్చే వేశారు. టెక్నాలజీపై రవికి బీభత్సమైన పట్టున్న రవి.. పోలీసులకు ఒక ఆధారం వదిలేశాడు.

IBomma Ravi: ఐబొమ్మ రవి పోలీసులకు ఎలా దొరికిపోయాడో తెలిస్తే..

ఐబొమ్మ రవి (IBomma Ravi) కేసు ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనంగా మారిన ఈ కేసులో రవికి నెట్టింట మద్దతు అయితే పుష్కలంగా ఉందని చెప్పాలి. దీనికి కారణం.. కొందరు సెలబ్రిటీల (Celebrities)ని కూడా చెప్పవచ్చు. అంటే వారు చేసిందేమీ లేదు కానీ పాప్‌కార్న్ (Popcorn) గురించి వారు చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. సినిమా చూడమన్నాం కానీ పాప్‌కార్న్ కొనుగోలు చేయమని చెప్పామా? అనే ప్రశ్న సెలబ్రిటీల నుంచి ఎదురవుతోంది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇమంది రవి చేసింది కరెక్టేనంటూ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక అసలు ఇమంది రవి ఎలా అరెస్ట్ అయ్యాడన్నది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. పోలీసులకే సవాల్ విసిరిన రవిని పట్టుకునేందుకు పోలీసులు గట్టి స్కెచ్చే వేశారు.

మూడు నెలలుగా రవి కదలికలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) నిఘా పెట్టారు. ఎట్టకేలకు హైదరాబాద్ (Hyderabad) వచ్చిన విషయం తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ సమాచారం ఎవరిచ్చారు అంటారా? మరెవరో కాదు.. ఇమంది రవి (Immandi Ravi). వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. టెక్నాలజీపై రవికి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతటి పట్టున్న రవి.. పోలీసులకు ఒక ఆధారం వదిలేశాడు. అదేంటంటే.. ఈఆర్‌ ఇన్ఫోటెక్‌ కంపెనీ పేరిట ఇమంత రవి డొమైన్‌లు కొనుగోలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ అతనిచ్చిన ఫోన్ నంబర్‌ను తీసుకుని దానిని హ్యాక్ చేశారు. అతడు ఎవరెవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకున్నారు. ఎక్కువ సమయం విదేశాల్లోనే గడిపే ఇమంది రవి.. అప్పుడప్పుడు హైదరాబాద్‌కు వచ్చి స్నేహితులతో కలిసి చిల్ అవుతుంటాడన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.

ఈమెయిల్ (Email) లింకుల ఆధారంగా అతని స్నేహితుడెవరనేది తెలుసుకుని అతడి ఫోన్ నంబర్ సంపాదించారు. అనంతరం రవి హైదరాబాద్‌కు ఎప్పుడొచ్చినా అతని సమాచారం పోలీసులకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రవి ఫ్యాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. వచ్చీ రాగానే తన మిత్రుడికి ‘మామా.. హైదరాబాద్‌ వచ్చా’ అంటూ మెసేజ్ చేశాడు. కూకట్‌పల్లిలోని తన నివాసానికి అతడిని ఆహ్వానించాడు. ఈ సమాచారం కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రవి నగరానికి వచ్చిట్టు పోలీసులు నిర్ధారించుకుని వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. రవి అరెస్ట్ వెనుక ఇంత కథ జరిగింది. రవిని పోలీసులు ఐదురోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడ కూడా వారికి ఏమాత్రం అతని నుంచి సపోర్ట్ అయితే లభించడం లేదు. పొంతనలేని సమాధానాలతో వారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తోంది. పైరసీ (Piracy) వ్యాపారం చేస్తున్న తను చేస్తున్న వ్యవహారమంతా ఏదో ఒకరోజు బయటపడుతుందని తెలుసని.. కానీ ఇంత త్వరగా బయటపడుతుందని ఊహించలేదని రవి చెప్పినట్టుగా తెలుస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 24, 2025 3:14 AM