Entertainment

Biggboss: వామ్మో.. ఈ బిగ్‌బాస్ మామూలోడు కాదు.. పిచ్చోడి చేతిలో రాయి పెట్టేశాడుగా..!

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగును రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ అయితే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటను రసవత్తరంగా మార్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు.

Biggboss: వామ్మో.. ఈ బిగ్‌బాస్ మామూలోడు కాదు.. పిచ్చోడి చేతిలో రాయి పెట్టేశాడుగా..!

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu)ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ (Biggboss) అయితే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆటను రసవత్తరంగా మార్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ పిచ్చోడి చేతిలో రాయి పెట్టేశాడు. ఈ సామెత మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎటు విసిరేస్తాడో కూడా తెలియదు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో పిచ్చోళ్లు అయితే ఎవరూ లేరు కానీ ఇష్టానుసారంగా.. ఎవరి అంచనాలకూ అందని విధంగా ప్రవర్తించే వ్యక్తి మాత్రం ఉన్నారు. ఆమె సంజనా గర్లాని (Actress Sanjana Garlani).

బిగ్‌బాస్ హౌస్ మొత్తం గొడవలు పెట్టేసి చోద్యం చూస్తుంటుంది. అది చాలదన్నట్టుగా ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెను చూస్తేనే హౌస్‌మేట్స్ భయపడుతున్నారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో గుడ్డు గొడవ గురించి తెలిసిందే. దాని తర్వాత ఓనర్స్ అంతా సంజనాకు ఓ పనిష్మెంట్ ఇచ్చారు. దాని ప్రకారం సంజనా తమ హౌస్‌లోకి అడుగు కూడా పెట్టకూడదు. రెండు రోజుల పాటు ఈ పనిష్మెంట్ అమల్లో ఉంటుంది. కష్టమే అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సంజనా కూడా దీనిని అంగీకరించింది. అలా చూస్తూ ఊరుకుంటే బిగ్‌బాస్ ఎలా అవుతాడు.. ఫిట్టింగ్ పెట్టనే పెట్టాడు. సంజనాను కన్ఫెషన్ రూమ్‌ (Confession Room)కి పిలిచినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి హౌస్‌ లోపల కన్ఫెషన్ రూమ్ ఉంటుంది. అంటే ఓనర్స్ పెట్టిన రూల్‌కి వ్యతిరేకంగా ఆమె హౌస్‌లోకి అయితే అడుగు పెట్టారు.

ఆ తరువాత సంజనా సెంటర్డ్‌గా క్యాప్టెన్సీ టాస్కు (Captaincy Task)లు జరిగినట్టుగా తెలుస్తోంది. ఆమె కెప్టెన్ కూడా అయిపోయినట్టు సమాచారం. సంజనాను హౌస్‌లోకి ఎంటర్ అవ్వద్దని చెప్పిన ఓనర్స్‌కి వ్యతిరేకంగా హౌస్‌లోకి అడుగు పెట్టడమే కాదు.. లగ్జరీ బెడ్ రూమ్‌లో తిష్ట వేసింది. మొత్తానికి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9కి ఫస్ట్ కెప్టెన్ సంజన (Biggboss Season 9 First Captain Sanjana Garlani) అయ్యింది. అసలే దేనికి ఎలా ఆమె రియాక్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అలాంటిది కెప్టెన్ అయితే ఆమె తీసుకునే డెసిషన్స్‌తో అందరికీ చుక్కలు కనిపించడం ఖాయం. ఇక ఇప్పుడు సంజన చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 11, 2025 9:09 AM