Dandoraa: ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా.. కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా
నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా
కొన్ని సార్లు పాటకు మ్యూజిక్ ప్రాణమైతే.. దాదాపుగా అన్ని సార్లు లిరిక్స్ ప్రాణమవుతాయి. ప్రస్తుతం ‘దండోరా’ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట విడుదలైంది. ఈ పాటలోని పవర్‌ఫుల్ లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
నిను మోసినా నను మోసినా
అమ్మ పేగు ఒకటేనన్నా
నిను కోసినా నను కోసినా
రాలే రగతం ఎరుపేనన్నా
చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా
నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా
ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా
కొట్టి కొట్టి గుండె డప్పయ్యెరా
దండోరా.. దండోరా... అంటూ సాగే లిరిక్స్ ప్రతి గుండెనూ టచ్ చేస్తున్నాయి. ఈ పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ‘దండోరా’ చిత్రంలోని పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. ఆంథోని దాసన్, మార్క్ కె.రాబిన్ పాటను పాడారు. తరాలు మారుతున్నా.. చంద్రుడి పైకి మనిషి అడుగు పెట్టి ఎన్నో ఏళ్లవుతున్నా కూడా సామాజిక అసమానతలు మాత్రం తగ్గటం లేదు. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఖ్యంగా అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథల పురాతన ఆచార సంప్రదాయాలతో పాటు వ్యంగ్యం, హాస్యం వంటి అంశాలన్నింటినీ మేకర్స్ జోడించారు. ఈ సినిమాకు ఆది నుంచే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మేకర్స్ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళతున్నారు. ఈక్రమంలోనే సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ సైతం పూర్తైంది. ఓవర్సీస్‌లో 200కు పైగా థియేటర్స్‌లో ఈ చిత్రం విడుదల కానుండటం విశేషం. సినిమా క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రీమియర్స్ డిసెంబర్ 23నే పడనున్నాయి.
ప్రజావాణి చీదిరాల