Anu Emmanuel: స్త్రీలకే అన్ని కండీషన్స్.. పురుషులకేం ఉండవు..
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో దుర్గ అనే పాత్రలో నటించానని.. ఫస్టాఫ్‌లో తనకు సంబంధించిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వాటిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారోననే భయం వేసిందని వెల్లడించింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) జంటగా నటించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The GirlFriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni), విద్య కొప్పినీడి (Vidya Koppineedi) నిర్మించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన సందర్భంగా దుర్గ పాత్రలో నటించిన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) మీడియాతో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమా కోసం తనకు ముందుగా నిర్మాత ధీరజ్ నుంచి కాల్ వచ్చిందని.. అనంతరం రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) తనను కలిసి కథ చెప్పారని అను ఇమ్మాన్యుయేల్ వెల్లడించింది. స్క్రిప్ట్‌తో పాటు తన పాత్ర గురించి విన్న తర్వాత తప్పనిసరిగా చిత్రంలో నటించాలని ఫిక్స్ అయ్యానని.. అమ్మాయిలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమని తెలిపింది.
ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతున్నా..
ఈ చిత్రం గీతా ఆర్ట్స్ (Geetha Arts) సమర్పణలో వస్తుండటంతో బాగా చూసుకుంటారనే నమ్మకం ఉందని తెలిపింది. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. అయితే తాను ఏ మూవీ చేసినా కూడా ప్రశంసలు ఆశించని వెల్లడించింది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun), నాని (Nani), నాగ చైతన్య (Naga Chaitanya), శివకార్తికేయన్ (Shiva Karthikeyan), కార్తి (Karthi), విశాల్ (Vishal).. వంటి స్టార్ హీరోలతో నటించానని... అయితే తాను చేసిన కొన్ని సినిమాల విషయంలో మాత్రం ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతున్నట్టు అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా సంతృప్తి అనేది ఉండదని.. ఆ సినిమాల్లో నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారని తెలిపింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో దుర్గ అనే పాత్రలో నటించానని.. ఫస్టాఫ్‌లో తనకు సంబంధించిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వాటిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారోననే భయం వేసిందని వెల్లడించింది.
కెరీర్ పరంగా అసంతృప్తితో ఉన్నా..
రాహుల్ తన పాత్రను తీర్చిదిద్దిన విధానం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. కమర్షియల్ మూవీస్‌లో తమతో ఓవర్ యాక్షన్ చేయిస్తారని.. దుర్గ పాత్రలో నటించేప్పుడు ఫస్ట్ తాను అలాగే ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ నటించాల్సి వచ్చిందని వెల్లడించింది. తన క్యారెక్టర్‌కు తనే డబ్బింగ్ చెప్పుకున్నట్టు తెలిపింది. అమెరికాలో పుట్టి పెరగడంతో తనకు ఈ చిత్రంలో అమెరికన్ యాక్సెంట్ మాట్లాడటం సులువైందని పేర్కొంది. రష్మిక ఈ చిత్రంలో భూమ పాత్రలో నటించిందని.. దుర్గలా ఉండాలంటే ముందు భూమలాగే ఉంటారని తెలిపింది. కెరీర్ పరంగా అసంతృప్తితో ఉన్నానని.. నటిగా మాత్రం సంతృప్తితో ఉన్నట్టు వెల్లడించింది. తను అవకాశాల కోసం ఆరాటపడే వ్యక్తిని కానని అను తెలిపింది.
ఆడిషన్స్ చేశా కానీ మూవీ చేయలేకపోయా..
యూఎస్ నుంచి ఇండియాకు వచ్చినప్పుడు తన నేటివ్ ప్లేస్ కేరళకు వెళ్లకుండా నేరుగా హైదరాబాద్ వచ్చానని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది. అప్పటి నుంచి హైదరాబాద్ వీడలేదని వెల్లడించింది. మాతృభాష అయిన మలయాళంలో పృథ్వీరాజ్ ‘ఆడుజీవితం’కు ఆడిషన్ చేశానని.. కానీ ఆ మూవీ చేయలేకపోయానని తెలిపింది. మంచి అవకాశం వస్తే మలయాళంలో మూవీ చేస్తానని వెల్లడించింది. "ది గర్ల్ ఫ్రెండ్" వంటి ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలు వర్కవుట్ కావాలంటే ప్రొడ్యూసర్ ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలని వెల్లడించింది. తమ చిత్రంలో చూపించినట్లుగా మహిళకు ఎన్నో కండీషన్స్ ఈ సొసైటీ పెడుతుంటుందని.. మగవారికి ఉద్యోగం, సంపాదన తప్ప మిగతా ఇలాంటి కండీషన్స్ ఏవీ ఉండవని అను ఇమ్మాన్యుయేల్ తెలిపింది.
ప్రజావాణి చీదిరాల