Peddi: ‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందా?
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను భారీగా పెంచేశాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో తప్పక సక్సెస్ అవుతుందనే అంతా భావిస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను భారీగా పెంచేశాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో తప్పక సక్సెస్ అవుతుందనే అంతా భావిస్తున్నారు. ఈ చిత్రం వాస్తవానికి ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 30, 2026న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడుతుందా? అనే టాక్ లేకపోలేదు. అయితే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు అయితే వాయిదా పడే ఛాన్సే లేదు.
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. అయితే ఆ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందనే విషయమై క్లారిటీ అయితే లేదు. ఈ వర్క్ త్వరగా పూర్తైతే అనుకున్న సమయానికి విడుదల ఫిక్స్ అయిపోయినట్టే. ఏప్రిల్ 30ను లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆలస్యమైతే విడుదల తేదీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ ఆలస్యమయ్యే అవకాశం లేదంటున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక్క వీఎఫ్ఎక్స్ మినహా ఇతర పనులన్నీ చకచకా పూర్తవుతున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద సినిమాకు వీఎఫ్ఎక్సే కీలకం కాబట్టి ఏమైనా దీనిలో ఇబ్బంది తలెత్తితే మినహా ‘పెద్ది’ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సే లేదు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.