Kishkindapuri: రామాయణంలోని నీతి.. హారర్ మిస్టరీతో బ్లెండ్ అవుతుందా?
హారర్, మిస్టరీ రెండూ ఒకరకంగా జంట పక్షులే. ఎప్పుడో ఒకసారి మాత్రం విడివిడిగా కనిపిస్తాయి. హారర్ మూవీ తీయాలనుకునేవారు మిస్టరీని మిక్స్ చేస్తే ఎక్కడా పట్టు సడలకుండా తీయాల్సి ఉంటుంది.

హారర్, మిస్టరీ రెండూ ఒకరకంగా జంట పక్షులే. ఎప్పుడో ఒకసారి మాత్రం విడివిడిగా కనిపిస్తాయి. హారర్ మూవీ తీయాలనుకునేవారు మిస్టరీని మిక్స్ చేస్తే ఎక్కడా పట్టు సడలకుండా తీయాల్సి ఉంటుంది. పైగా హారర్, మిస్టరీ కాన్సెప్ట్స్ ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో కథ కొత్తగా ఉండాలి. అలా అయితే సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. పాత కథను కొత్త సీసాలో పోసి అందించినా కూడా కథనం కొత్తగా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతుంది.
1980 నాటి కథను.. ప్రస్తుత కథతో అనుసంథానం చేస్తూ తీసిన సినిమాలు చాలా అరుదనే చెప్పాలి. వీటికి ఒక హారర్ (Horror), మిస్టరీ (Mystery)ని యాడ్ చేసి మరీ సినిమాగా తీసి దానికి ‘కిష్కిందపురి (Kishkindapuri)’ అనే టైటిల్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రం ఘోస్ట్ వాకింగ్ (Ghost Walking) అనే కొత్త కాన్సెప్ట్‌తో రూపొందింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను ‘కిష్కిందపురి’ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి (Koushik Pegallapati) మీడియాకు వివరించారు. ఈ సినిమా కథ ప్రారంభం కావడానికి రూట్ కాజ్ అయితే రామాయణం (Ramayana) అని కౌశిక్ తెలిపారు. అయితే సినిమా కథ రామాయణం అయితే కాదని తెలిపారు. రామాయణంలోని నీతి.. ఒక హారర్ మిస్టరీలో ఎలా బ్లెండ్ అవుతాయనేది ఆలోచించి సినిమాను ప్రారంభించినట్టు తెలిపారు.
కథ రాసిన తర్వాతే..
‘మనిషి తన భయాల వల్లో.. బాధల వల్లో తన ఆనందాన్ని తనే కోల్పోతాడు. అలాంటి శూన్య శరీరంలోకి ఎలాంటి దుష్ట శక్తి అయినా ఆవహించగలదనే ఒక పాయింట్ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. రామాయణంలోని నీతిని మా సినిమాలో అప్లై చేశామని కానీ అది నేరుగా కనిపించదని కౌశిక్ తెలిపారు. రేడియో స్టేషన్ (Radio Station)కు వెళ్లడం వల్ల వచ్చే పరిస్థితులేంటి? అనే విషయం ఆధారంగా సినిమాను రూపొందించినట్టు తెలిపారు. ఘోష్ట్ వాకింగ్ టూర్‌ను తాను స్వీడన్‌లో చూశానని కౌశిక్ తెలిపారు. దానిని తమ సినిమాలో పెట్టినట్టు చెప్పుకొచ్చారు. కథ రాసిన తర్వాతే అనుపమను హీరోయిన్‌గా అనుకున్నట్టు తెలిపారు. ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే తన అసిస్టెంట్.. ప్రతి క్యారెక్టర్ కోసం పెక్యులర్ ఫేస్ కావాలనడంతో కొందరు తప్ప మిగిలిన వారందరినీ కొత్తవారినే తీసుకున్నట్టు తెలిపారు.
ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం అదే..
తమ సినిమాలో ఒక్క స్మోకింగ్, డ్రికింగ్ సీన్ ఉండదని చెప్పారు. అయితే తమ సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం సెన్సార్ వారిని కూడా తమ సినిమా భయపెట్టడమేనన్నారు. పిల్లలు సైతం భయపడతారు కాబట్టి ఏ సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. ఇక సినిమా స్టోరీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వినగానే ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అలాగే సినిమాను రూపొందించాలని చెప్పాడని కౌశిక్ తెలిపారు. శ్రీనివాస్‌కు తన ఇంట్లోనే కథను వినిపించారట. ఆ సమయంలో శ్రీనివాస్ వాళ్ల ఇంట్లో కరెంట్ పోయిందట. శ్రీనివాస్ చాలా భయపడిపోయాడంటూ కౌశిక్ చెప్పుకొచ్చారు. మొత్తానికి తమ సినిమాతో అయితే పక్కాగా ప్రేక్షకులను భయపెడతామని గట్టిగానే చెబుతున్నారు. అలాగే రామాయణంలోని నీతి.. హారర్ మిస్టరీతో బ్లెండ్ అవుతుందా? తెలియాలంటే..సెప్టెంబర్ 13 వరకూ వేచి చూడాల్సిందే.
ప్రజావాణి చీదిరాల