They Call HIm OG: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఓజీ.. ఎన్ని వందల కోట్లకు రీచ్ అయ్యిందో తెలిస్తే..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan OG) అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసేలా చేసిన చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan OG) అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసేలా చేసిన చిత్రం ‘ఓజీ’ (They Call Him OG). ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం రూ. 200 కోట్లను క్రాస్ చేసేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా తొలి వీకెండ్ నాటికి రూ.230 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. అంతర్జాతీయంగా కూడా ‘ఓజీ’ (OG) కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలి నాలుగు రోజుల్లో విదేశాల్లో మొత్తంగా $7 మిలియన్లకు (రూ.62 కోట్లు) వసూళ్లు (OG Collections) సాధించింది.
దీంతో ఈ సినిమా (OG Movie) నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ‘ఓజీ’ (OG Worldwide Collections) ప్రపంచవ్యాప్తంగా ₹252 కోట్లు సంపాదించిందని చిత్ర నిర్మాతలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చిత్ర దర్శకుడు సుజీత్ (OG Movie Director Sujeeth) ఈ విషయాన్ని వెల్లడించారు. కేవలం నాలుగు రోజుల్లోనే.. ‘ఓజీ‘ ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్‌లను అధిగమించగలిగింది. అవి రైడ్ 2 (Ride 2) రూ.246 కోట్లు, గంగూబాయి కతియావాడి (Gangubai Kathiawadi) రూ.210 కోట్లు, 83 రూ.193 కోట్లు, గేమ్ ఛేంజర్ (Ram Charan Game Changer) రూ.200 కోట్లు, గుంటూరు కారం రూ.182 కోట్లు.
ఈ సినిమా కలెక్షన్స్ ఎంతవరకూ వెళతాయనేది ఎవరి అంచనాలకు అందడం లేదు. ఇవాళ (సోమవారం) కలెక్షన్ల పరిస్థితి చూసిన మీదట కానీ ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి (Emraan Hashmi) ఓ ముఖ్య పాత్రలో నటించారు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు దాటిన సినిమా కావడంతో పాటు.. ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (OG Heroine Priyanka Mohan), శ్రీయా రెడ్డి (Sriya Reddy), అర్జున్ దాస్ (Arjun Das), ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా కీలక పాత్రల్లో నటించారు.
ప్రజావాణి చీదిరాల