Entertainment

Naturalstar Nani: నాని ట్రెండ్ సెట్ చేస్తారా?

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుంచి ఓ పాట విడుదలైంది. అంతకు ముందే గ్లింప్స్‌తో షాకిచ్చారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం డిఫరెంట్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.

Naturalstar Nani: నాని ట్రెండ్ సెట్ చేస్తారా?

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుంచి ఓ పాట విడుదలైంది. అంతకు ముందే గ్లింప్స్‌తో షాకిచ్చారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం డిఫరెంట్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని స్టైల్ ఇప్పటి వరకూ ఎవరూ అనుసరించింది లేదు. రెండు జడలు వేసుకుని నాని వినూత్నంగా కనిపించారు. ఆ తరువాతి నుంచి సోషల్ మీడియాలో రెండు జడలతో పెద్ద ఎత్తున వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందంకు రెండు జడలు వేసి వైరల్ చేస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ నుంచి పాట విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిందో లేదో కానీ.. నాని లుక్ మాత్రం సెన్సేషన్‌గా మారింది. షేర్ పాటలో నాని రగ్డ్ స్టైల్, ఎనర్జిటిక్ డాన్స్, మాస్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాని గతంలో ఏ సినిమాలోనూ చేయనటువంటి హార్డ్ ఫ్లోర్ స్టెప్స్ ఈ చిత్రంలో చేశారు. అది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే నాని రెండు జడలు మరో ఎత్తు. ఇప్పటి వరకూ ఎన్నో స్టైల్స్ చూశాం కానీ ఇటువంటి స్టైల్‌ను మాత్రం ఇప్పటి వరకూ చూసిందే లేదు.

మొత్తానికి నాని అయితే రెండు జడలతో ట్రెండ్ అయితే సెట్ చేసినట్టేనా? అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఇప్పటికే కొందరు రెండు జడలతో సోషల్ మీడియాలో స్టెప్పులేస్తున్నారు. మరి ఇది స్టెప్పుల వరకే పరిమితమా? లేదంటే ఇది కూడా ట్రెండ్ అయి కూర్చుంటుందా? అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ వరల్డ్ స్థాయిలో విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 25, 2026 9:46 AM