Entertainment

Vijay-Rashmika: ఎందుకింత దారుణమైన ప్రచారం?

విజయ్ దేవరకొండ పుట్టపర్తి (Puttaparthi) వెళ్లి వస్తుండగా ఆయన కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు మాత్రం స్వల్పంగా దెబ్బతినగా.. విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడ్డాడు.

Vijay-Rashmika: ఎందుకింత దారుణమైన ప్రచారం?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) - రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఎంగేజ్‌మెంట్ అయితే అయిపోయింది. ఈ విషయాన్ని వారి సన్నిహితులే వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చిలోనే వివాహం అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిదీ డెస్టినేషన్ వివాహ (Vijay and Rashmika marriage)మని అంటున్నారు. ప్లేస్ మాత్రం ఇంతవరకూ డిసైడ్ కాలేదని సమాచారం. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ వేలికి బంగారపు ఉంగరంతో కనిపించగా.. రష్మిక తాజాగా వజ్రపు ఉంగరంతో దర్శనమిచ్చింది. దీంతో అవే వారిద్దరి ఎంగేజ్‌మెంట్ రింగ్స్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

అది ఎంగేజ్‌మెంట్ రింగేనట..

‘గీత గోవిందం’ (Geetha Govindam)లో నటించి మంచి ఆన్‌స్క్రీన్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ జత కట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 3న ఎంగేజ్‌మెంట్ (Vijay and Rashmika Engagement) కూడా చేసుకుంది. ఎంగేజ్‌మెంట్ తర్వాత పుట్టపర్తి సాయిబాబా (Puttaparthi Saibaba) మహాసమాధిని దర్శించుకునేందుకు విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda), కొందరు స్నేహితులతో కలిసి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చాయి. వాటిలో విజయ్ వేలికి బంగారపు ఉంగరంతో కనిపించాడు. దీంతో అది ఎంగేజ్‌మెంట్ రింగేనంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తాజాగా రష్మిక తన పెట్ డాగ్‌తో ఆడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. దీనిలో వజ్రపు ఉంగరంతో రష్మిక కనిపించింది. అది ఎంగేజ్‌మెంట్ రింగేనంటూ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది సీన్ కట్ చేస్తే నెట్టింట వీరిద్దరి గురించి మరో రచ్చ కూడా జరుగుతోంది.

అదంతా రష్మిక కారణంగానేనా?

విజయ్ దేవరకొండ పుట్టపర్తి (Puttaparthi) వెళ్లి వస్తుండగా ఆయన కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో కారు మాత్రం స్వల్పంగా దెబ్బతినగా.. విజయ్ దేవరకొండ క్షేమంగా బయటపడ్డాడు. దీనికి తోడు.. గత ఏడాది ముంబైలో విజయ్ దేవరకొండ స్టెప్స్ దిగుతూ స్లిప్ అయి పడిపోయాడు. ఈ రెండు వీడియోలను పెట్టి రష్మికతో ఎంగేజ్‌మెంట్ ఎఫెక్ట్ అని.. విజయ్‌కు ప్రమాదాల మీద ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కొందరు సోషల్ మీడియా (Social Media)లో రచ్చ చేస్తున్నారు. ఎప్పుడో విజయ్ స్టెప్స్ మీద నుంచి పడిపోతే ఇప్పుడు పడిపోయినట్టుగా క్రియేట్ చేసి.. అదంతా రష్మికతో ఎంగేజ్‌మెంట్ కారణంగానే జరిగిందని చెబుతున్నారు. వాస్తవానికి ఎంగేజ్‌మెంట్ తర్వాత ప్రమాదం జరిగినా కూడా విజయ్ క్షేమంగా బయటపడ్డాడు. అలా చూస్తే రష్మిక అతని జీవితంలోకి రాగానే అదృష్టం వరించి చిన్న గాయం కూడా లేకుండా విజయ్ బయటపడ్డాడని అనుకోవచ్చుగా..

వేరే విషయాలను పట్టించుకోను..

ప్రతి విషయానికి పాజిటివ్ (Positive) ఉంటుంది.. నెగిటివ్ (Negetive) ఉంటుంది. మన దృష్టి కోణాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. ఇంతకు మించిన దారుణం ఏంటంటే.. ఎప్పుడో వీడియోను.. ఇప్పుడు జరిగినట్టుగా క్రియేట్ చేయడం. ఎందుకింత దారుణమైన.. వినడానికే అసహ్యంగా ఉండే ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి. సోషల్ మీడియా (Social Media) మంచికి ఎంతగా ఉపయోగపడుతోందో.. చెడుకు కూడా అంతే. అందుకేనేమో రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి మాత్రమే ఎవరైనా మాట్లాడితే తీసుకుంటానని.. వేరే విషయాలను తాను పట్టించుకోనని చెప్పింది. నిజమే ఇలాంటి ఫేక్ ప్రచారాలను మనసుకు తీసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 11, 2025 7:45 AM