Janhvi Kapoor: మృణాల్, జాన్వీలకు టాలీవుడ్‌లో ఎందుకంత తేడా?
బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood)కు అడుగుపెట్టిన నటీమణులు ఇక్కడ దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ (Mrunal Takur), దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తదితరులు టాలీవుడ్‌లో చేసిన చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood)కు అడుగుపెట్టిన నటీమణులు ఇక్కడ దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ (Mrunal Takur), దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తదితరులు టాలీవుడ్‌లో చేసిన చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో మృణాల్ ఠాకూర్ ప్రధానంగా గ్లామర్, సాధారణ పాత్రలు పోషిస్తున్న సమయంలో ‘సీతారామం’ (Sitharamam) అనే టైటిల్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తరువాత తెలుగులో ‘హాయ్ నాన్న’ (Hai Nanna) అనే చిత్రంలో నటించింది. ఈ రెండు చిత్రాలూ ముద్దుగుమ్మ నటనను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా ‘సీతారామం’ ఒక్కటి చాలు.. అమ్మడి రేంజ్ ఏంటో తెలియజెప్పడానికి.. ఈ సినిమా తర్వాత అమ్మడికి బాలీవుడ్‌లోనూ మంచి పాత్రలే వస్తున్నాయి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విషయం మాత్రం మృణాల్‌కు పూర్తి భిన్నంగా ఉంది. మృణాల్ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తే.. జాన్వీకి మాత్రం గ్లామర్‌కు ప్రాధాన్యమున్న పాత్రలు వస్తున్నాయి. ఇప్పటికే అమ్మడు ‘దేవర’ (Devara) చిత్రంలో నటించింది. కానీ అమ్మడి క్యారెక్టర్ ఆ చిత్రంలో అంతంత మాత్రమే. పార్ట్ 2లో మాత్రం ఆమెకు గట్టి ప్రాధాన్యమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్‌లో రామ్ చరణ్ (Ram Charan) సరసన ‘పెద్ది’ (Peddi) అనే చిత్రంలో నటిస్తోంది. ‘దేవర’లో లంగా ఓణీతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ‘పెద్ది’లోనూ లంగా ఓణీతోనే అలరించనుంది. రెండు పాత్రల్లో లంగా ఓణీ కామన్ అయినా కూడా ‘పెద్ది’ గ్లామర్ డోస్ కాస్త పెంచినట్టుగా కనిపిస్తోంది. ఈ భామ.. శ్రీదేవి కూతురు కావడంతో ఈ భామ నుంచి ప్రేక్షకులు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఆశిస్తున్నారు. కానీ అమ్మడికి మాత్రం ఎందుకో గ్లామర్‌కు ప్రాధాన్యమున్న పాత్రలే వస్తున్నాయి. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి అమ్మడికి సంబంధించి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ గ్లామర్ (Janhvi Glamour)నే హైలైట్ చేస్తున్నాయి. అవి చూసిన వారంతా జాన్వీ పాపను కేవలం సినిమాకు గ్లామర్ కావాలి కాబట్టి దానికే పరిమితం చేశారా? అనే సందేహం తలెత్తుతోంది. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు మృణాల్ ఠాకూర్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల (Tollywood Audiance)ను మెప్పించి ఆ తరువాత మంచి పాత్రలతో దూసుకెళతుంటే.. జాన్వీ మాత్రం కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడం సరైనది కాదని నెటిజన్లు.. సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ అంటేనే అందాల ఆరబోతకు కేరాఫ్ అని అంతా అంటుంటారు. కానీ ఇప్పుడు అది టాలీవుడ్ (Tollywood)కి కూడా పాకేసింది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలనేవి కేవలం ఒక స్పెషల్ సాంగ్‌కో ఒకటీ అర రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యేది కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. కథతో సంబంధం లేకుండా హీరోయిన్లే ఏకంగా అందాలను ఆరబోస్తున్నారు. పరిస్థితి ఎంతలా మారిందంటే.. అందాల ఆరబోత లేకుంటే సినిమాను జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ముద్దుగుమ్మలు వస్తున్నారంటే వారు గ్లామర్ పాత్ర చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి మేకర్స్ సైతం ముద్దుగుమ్మలను అలాగే వినియోగిస్తున్నారు. అయితే జాన్వీ క్యారెక్టర్ మాత్రం అందాల ఆరబోత ఉన్నా కూడా పవర్‌ఫుల్‌గానే ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక సినిమా చూస్తే కానీ అమ్మడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది తెలియదు.