కన్నుబొమ్మా.. కనువిందు చేసే బొమ్మా.. హైప్ కోసం తంటాలెందుకమ్మా?
కన్ను బొమ్మతో కనువిందు చేసే బిగ్‌బాస్ షో 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అసలు ఈ సీజన్‌పై హైప్ పెంచేందుకు అయితే నిర్వాహకులు తెగ ట్రై చేస్తున్నారు. మరి ఇది గతంలో కొన్ని సీజన్ల మాదిరిగా పైకి లేస్తుందా? లేదంటే ఊరించి ఉసూరుమనిపిస్తుందా?

కన్ను బొమ్మతో కనువిందు చేసే బిగ్‌బాస్ షో 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. అసలు ఈ సీజన్‌పై హైప్ పెంచేందుకు అయితే నిర్వాహకులు తెగ ట్రై చేస్తున్నారు. మరి ఇది గతంలో కొన్ని సీజన్ల మాదిరిగా పైకి లేస్తుందా? లేదంటే ఊరించి ఉసూరుమనిపిస్తుందా? ప్లానింగ్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. మరి ఎగ్జిక్యూషన్ అంతే గట్టిగా ఉంటుందా? అసలు సామాన్యులేంటి? సెలబ్రిటీలేంటి? హౌస్‌లోకి అడుగు పెట్టాక ఎవరైనా ఒకటే కదా? ముందు నుంచే ఈ డిఫరెన్సియేషన్ ఏంటి? పోనీ ఏదైనా ఇద్దరి మధ్య ఇంట్రస్టింగ్ వార్ క్రియేట్ చేస్తారేమో అనుకుంటే.. మరి కామన్ మ్యాన్ ఒక్కరికే ఎందుకు హౌస్‌లోకి అడుగు పెట్టడానికి ముందు టాస్క్‌లు? సెలబ్రిటీలకు ఎందుకు లేవు? పోనీ ఇంత చేసి ఏమైనా హైప్ క్రియేట్ చేయగలుగుతోందా? వంటి విషయాలన్నింటిపై సమగ్ర కథనం..
వాళ్లే జడ్జీలు
‘బిగ్‌బాస్’ తెలుగు రియాల్టీ షో ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తై పోయింది. ఈసారి బిగ్‌బాస్‌లో రెండు హౌస్‌లు ఉండబోతున్నాయని హోస్ట్ నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. ‘ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్’ అంటూ ప్రోమోను వదిలారు బిగ్‌బాస్ నిర్వహకులు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 40 మందిని తీసుకున్నారు. ఈ 40 మంది నుంచి 25 మందిని తొలగించి 15 మందిని తీసుకోనున్నారు. దీనికోెసం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి జడ్జిలుగా అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వ్యవహరిస్తున్నారు. మొత్తానికి సామాన్యులను ఒక హోంలో.. సెలబ్రిటీలను ఒక హోంలో పెట్టి గేమ్ ఆడిస్తారనేది టాక్. మరి ఇది నిజమేనా? లేదంటే ఇరువురినీ క్లబ్ చేసి రెండు గ్రూప్‌లుగా చేస్తారో చూడాలి. గతంలో మాదిరిగా సెలబ్రిటీల నుంచి కూడా పెద్దగా నేమ్, ఫేమ్ ఉన్నవారినేం తీసుకోవడం లేదు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న వారినే తీసుకుంటున్నారు. మరి వారే దొరుకుతున్నారేమో తెలియదు. పోనీ శివాజీ మాదిరిగా హౌస్‌లోకి వచ్చి బిగ్‌బాస్‌కి హైప్ తీసుకొస్తే పర్వాలేదు కానీ తలనొప్పిగా వ్యవహరిస్తేనే కష్టం. అవన్నీ ఓకే అనుకున్నా కూడా ఎందుకు వెన్నెల కిషోర్‌ని బిగ్‌బాస్ ప్రచారం కోసం వాడినందుకు? అంటే దీనికి హైప్ లేదా? క్రియేట్ చేసేందుకు పడుతున్న తంటాలా ఇవి? అసలు కంటెస్టెంట్స్ ఎంపిక ఏ బేసిస్‌లో జరిగింది? ఒకటా.. రెండా? సవాలక్ష ప్రశ్నలు.. సమాధానాలే కరవు.
ప్లానింగ్ కాదు.. ప్లానెట్ బ్లెస్సింగ్స్..
తాజాగా వదిలిన ప్రోమోలో వెన్నెల కిషోర్ కనిపించి తెగ హడావుడి చేసేశాడు. వెన్నెల కిషోర్ కారులో వస్తుంటాడు. ఫోన్ చేసి తన నెక్ట్స్ 100 డేస్ షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయమని చెబుతాడు. తనకో కొత్త ప్లాన్ ఉందని.. తాను బిగ్‌బాస్ సీజన్ 9కు వెళ్లాలనుకుంటున్నట్టు చెబుతాడు. అప్పుడు డ్రైవర్ సడెన్‌గా కార్ ఆపేసి.. ప్లానింగ్ ఉంటే పరిపోదని.. ప్లానెట్స్ బ్లెస్సింగ్ కూడా అవసరమని చెబుతాడు. అప్పుడు వెన్నెల కిషోర్ ఆ నవగ్రహాల కామన్ ఫ్రెండ్ గురించి అడగ్గా.. కమాండింగ్ ఫ్రెండ్ ఉన్నాడని డ్రైవర్ చెబుతాడు. దీంతో కిషోర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెడతాడు. అక్కడ నాగ్ కనిపిస్తారు. అక్కడ నాగార్జునతో సంభాషణ.. ఏకంగా బిగ్‌బాస్‌నే మార్చేస్తున్నట్టు నాగ్ చెబుతారు. అవాక్కవడం వెన్నెల కిషోర్ వంతు అవుతుంది. మొత్తానికి కొండంత రాగమైతే తీస్తున్నారు కానీ కొండెంక పాటైతే పాడరు కదా.. ఏమో చూడాలి.. బిగ్‌బాస్ హౌస్ కదా.. ఏమైనా జరగొచ్చు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచుదాం.
ప్రజావాణి చీదిరాల