Entertainment

Biggboss9: కమెడియన్స్ ఎందుకు ఇంతలా ఫెయిల్ అవుతున్నారు?

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అగ్నిపరీక్ష అంటూ కామనర్స్‌ని.. మరి ఏ బేసిస్‌లో సెలబ్రిటీలను తీసుకున్నారో కానీ ఈ షో మొత్తం పేలవంగానే నడుస్తోంది.

Biggboss9: కమెడియన్స్ ఎందుకు ఇంతలా ఫెయిల్ అవుతున్నారు?

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అగ్నిపరీక్ష (Agnipariksha) అంటూ కామనర్స్‌ని.. మరి ఏ బేసిస్‌లో సెలబ్రిటీల (Celebrities)ను తీసుకున్నారో కానీ ఈ షో మొత్తం పేలవంగానే నడుస్తోంది. ఎక్కడా ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపించడం లేదు. ఈ రియాలిటీ షో (Biggboss Reality Show)కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ షో ఆ క్రేజ్‌ అంతటినీ తీసి పారేసేలా ఉంది. మీరు మొదటి నుంచి అంటే బిగ్‌బాస్ సీజన్ 1 (Biggboss Season 1) నుంచి గమనిస్తున్నారో లేదో కొందరు కమెడియన్స్ (Commedians) మాత్రం ఈ షోకి వచ్చి అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు (Smapoornesh Babu).. బిగ్‌బాస్‌కి వచ్చి రెండవ రోజు నుంచే వెళ్లిపోతానంటూ నానా రాద్దాంతం చేశాడు.

ఆ తరువాత మరో సీజన్‌లో వచ్చిన చలాకీ చంటి (Chalaki Chanti).. ఆయనదీ ఇదే ధోరణి. ఏదో గెస్ట్‌లా వచ్చి వెళ్లిపోయినట్టుగా అనిపించింది. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే సుమన్ శెట్టి (Suman Shetty). అసలు షోకి ఎందుకు వచ్చాడో అర్థమే కావడం లేదు. కనీసం ఆయన నుంచి కామెడీ కాదు కదా.. కనీసం ఎలాంటి ఫుటేజ్‌ని బిగ్‌బాస్ నిర్వాహకులు రాబట్టుకోలేకపోతున్నారు. చివరకు అతడిని నామినేట్ చేసినా కూడా కనీసం డిఫెండ్ చేసుకోలేదు. ప్రస్తుతం సుమన్ శెట్టి కెరీర్ పరంగా చాలా లోలో ఉన్నాడు. అతనికిది మంచి అవకాశం అని చెప్పాలి. కానీ అతడు ఎందుకో వినియోగించుకోవడమే లేదు. తనలోని కామెడీ యాంగిల్‌ను బయటకు తీస్తే షో రసవత్తరంగా మారడమే కాదు. అతనికి కూడా అవకాశాల పరంగా బాగా కలిసొచ్చే అవకాశమూ లేకపోలేదు. మరి ఎందుకు సుమన్ శెట్టికి ఈ విషయం తెలియడం లేదో అర్థం కావడం లేదు. వాస్తవానికి అతను యాక్టివ్‌గా లేడని చెప్పే అతడిని హౌస్‌మేట్స్ (Housemates) నామినేట్ చేశారు.

ఇక ఈ షోలో మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel) కూడా ఉన్నాడు. వాస్తవానికి షోలలో అతడు విపరీతంగా ఆకట్టుకుంటాడనడంలో సందేహమే లేదు. మరి బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో అతనికి ఏమైందో తెలియడం లేదు. తనకు ఇచ్చిన పనిని అతడు చక్కగా చేస్తున్నాడు కానీ అంతకుమించి మాత్రం ఏమీ చేయడం లేదు. రెండు రోజుల్లోనే ఏం ఫుటేజ్ వస్తుందనే సందేహం రావొచ్చు. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మరి ఆ ఇంప్రెషన్ వేయకుంటే ఎలా? వాస్తవానికి ఇలాంటి షోలలో కమెడియన్స్‌కి ఉన్నంత స్కోప్ మరొకరికి ఉండదు కానీ దానిని వినియోగించుకోవడంలో వారు మాత్రం ఫెయిల్ అవుతున్నారనడంలో సందేహం లేదు. మున్ముందు ఇమ్మూ కాస్త మారే అవకాశం ఉంది కానీ సుమన్ శెట్టి అయితే ఏమాత్రం మారేలా కనిపించడం లేదు. ఇలాగే ఉంటే ఒకట్రెండు సీజన్లలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 10, 2025 3:49 AM