Entertainment

Pawan Kalyan OG: ‘ఓజీ’ సౌండ్ తగ్గిందని చెప్పిందెవరు? మోత మోగుతుంటే..

ఇటీవలి కాలంలో ‘ఓజీ’ మూవీ సడీ సప్పుడు చెయ్యడం లేదని.. కొందరు గగ్గోలు పెట్టారు. ఒక్కసారిగా ఎందుకో సైలెంట్ అయిపోయిందంటూ రకరకాల కథనాలు.. కానీ ‘ఓజీ’ సౌండ్ తగ్గిందెక్కడ? మోత మోగిపోతోంది.

Pawan Kalyan OG: ‘ఓజీ’ సౌండ్ తగ్గిందని చెప్పిందెవరు? మోత మోగుతుంటే..

ఇటీవలి కాలంలో ‘ఓజీ’ మూవీ సడీ సప్పుడు చెయ్యడం లేదని.. కొందరు గగ్గోలు పెట్టారు. ఒక్కసారిగా ఎందుకో సైలెంట్ అయిపోయిందంటూ రకరకాల కథనాలు.. కానీ ‘ఓజీ’ సౌండ్ తగ్గిందెక్కడ? మోత మోగిపోతోంది. అప్పుడెప్పుడో ఓ చిత్రంలో ‘ట్రెండ్ ఫాలో అవను.. సెట్ చేస్తా’.. అని పవన్ చెప్పారు గుర్తుందా? అదెలా మరచిపోతారులే.. ఇప్పటికీ ట్రెండింగ్ డైలాగ్ కదా అది. ఇప్పుడు అదెందుకంటే.. ‘ఓజీ’ సాంగ్స్ ట్రెండ్ సెట్టర్‌గానే ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan), సుజీత్ (Director Sujith) కాంబోలో రూపొందుతున్న చిత్రమే ‘ఓజీ’ (OG). గత ఏడాది వరకూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కొంతమందైతే పవన్ సినిమాలు ఇక మీదట రావని కూడా తేల్చేశారు. అలాంటిది ఈ ఏడాది పవన్ చిత్రాలు వరుసగా విడుదలవుతుండటం ఫ్యాన్స్‌ (Pawan Fans)కు కావల్సినంత ఆనందాన్నిస్తోంది. ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu)తో వెండితెరపై మెరిసిన పవన్.. ఇప్పుడు ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని తర్వాత ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagatsingh) కూడా లైన్‌లో ఉంది. ఇక ప్రస్తుతం ‘ఓజీ’ విషయానికి వస్తే.. ఇప్పటికే ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ (Trans Of Omi) అంటూ ఓ సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘గన్స్ ఎన్ రోజెస్’ (Guns N Roses) అంటూ మరో సాంగ్ వచ్చేసింది. యూత్‌కి ఈ సాంగ్ బాగా కనెక్ట్ అవుతుందనడంలో సందేహమే లేదు.

సినిమా కథ తీవ్రత, స్థాయిని తెలియజేసే ఈ పాటకు తమన్ (SS Thaman) సంగీతం అందించారు. మొత్తానికి తమన్ అయితే ఓ వెరైటీ ప్రయోగం అయితే చేశారనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాత్ర ఎంత శక్తివంతమైనదనేది చెప్పడమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందనేది ఈ పాట ద్వారా తెలియజేసే ప్రయత్నం మేకర్స్ చేశారు. ఈ పాట మరెదో అనుకునేరు.. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన ‘హంగ్రీ చీతా’ పాటే ఇది. డీవీవీ దానయ్య (DVV Danaiah), కళ్యాణ్ దాసరి (Kalyan Dasari) నిర్మించిన ఈ చిత్రంలో ‘ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi), ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రియా రెడ్డి (Sriya Reddy) తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి మరో పది రోజుల్లో ‘ఓజీ’ తుఫాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతోందంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 15, 2025 2:23 PM