‘వార్2’.. ‘కూలీ’ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
ఇద్దరి మధ్య మూడేళ్లు మాత్రమే ఏజ్ గ్యాప్. పెద్ద వయసేం లేదు ఇద్దరికీ.. అయినా కూడా పెద్ద భారాన్నే భుజాన వేసుకున్నారు. నువ్వా.. నేనా? అన్నట్టుగా రెండు చిత్రాలు బుకింగ్స్ విషయంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి.

‘వార్2’.. ‘కూలీ’ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున విడుదల కావడం విశేషం. సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘కూలీ’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’. రెండు సినిమాలూ భారీ బడ్జెట్‌తో రూపొందించినవే. ‘కూలీ’కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తే.. ‘వార్2’కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అయాన్ బర్త్‌డే ఆగస్ట్ 15 అయితే.. లోకేష్ పుట్టినరోజు ఆగస్ట్ 14. ఇద్దరి మధ్య మూడేళ్లు మాత్రమే ఏజ్ గ్యాప్. పెద్ద వయసేం లేదు ఇద్దరికీ.. అయినా కూడా పెద్ద భారాన్నే భుజాన వేసుకున్నారు. ఇద్దరూ యంగ్ డైరెక్టర్సే కాబట్టి కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
‘కూలీ’తో పోలిస్తే.. ‘వార్2’..
ఇక ఈ రెండు సినిమాల్లో అగ్ర తారాగణమే నటించింది కాబట్టి.. రెమ్యూనరేషన్స్ బీభ్సంగానే ఉన్నాయి. ఈ విషయంలో ‘కూలీ’ ఒకడుగు ముందే ఉంది. రెమ్యూనరేషన్స్‌కే దాదాపు ‘కూలీ’ రూ.250 కోట్లు వెచ్చించిందని టాక్. ‘వార్ 2’ విషయానికి వస్తే ఇక్కడ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆరే ఎక్కువ రెమ్యూరేషన్ తీసుకున్నట్టు టాక్. ఎన్టీఆర్ రూ.60 కోట్లు తీసుకుంటే.. హృతిక్ రూ.48 కోట్లు, అయాన్ ముఖర్జీ రూ.30 కోట్లు, కియారా రూ.15 కోట్లు తీసుకుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా దాదాపు అగ్రతారాగణానికే రూ.110 కోట్లు వెచ్చించింది. ఇది ‘కూలీ’తో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. ఇక ఈ రెండు చిత్రాలు విడుదలకు ముందే సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
బుకింగ్స్‌లో బీట్ చేసేసింది..
రెండు సినిమాలకూ బొమ్మ బ్లాక్ బస్టర్ అని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా బుకింగ్స్ పీక్స్‌లో ఉన్నాయి. నువ్వా.. నేనా? అన్నట్టుగా రెండు చిత్రాలు బుకింగ్స్ విషయంలో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. విడుదలకు ముందే కూలీ బుకింగ్స్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిందంటూ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూ.70 కోట్లకు పైగా అయ్యిందని సమాచారం. రిలీజ్‌కు ముందే ఆ రూ.30 కోట్లు కూడా కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ‘వార్2’ ఏమైనా తక్కువ తిన్నదా.. అంతకు మించే బుకింగ్స్‌లో దూసుకెళుతోంది. మొత్తంగా లెక్కలైతే బయటకు రాలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘వార్2’ బుకింగ్స్‌లో ముందుంది. ఆగస్టు 13 ఉదయం కేవలం గంట వ్యవధిలో కూలీని అడ్వాన్స్ బుకింగ్స్‌లో వార్ 2 బీట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ సినిమా.. 2.93వేల టికెట్లు అమ్ముడవగా, 'వార్-2'కి 3.64వేలు అమ్ముడయ్యాయి. ఇదే హవా కొనసాగితే మాత్రం ‘కూలీ’ని ‘వార్2’ క్రాస్ చేయడం పక్కా. ఇదంతా ఎన్టీఆర్ మహిమే అనడంలో సందేహమే లేదు.
కంటెంటే కీలకం..
రెండు సినిమాల అంచనాల విషయంలో అయితే ఏమాత్రం తేడా లేదు. పైగా ఇప్పటికే ఈ సినిమాలను వీక్షించిన వారి నుంచి అద్భుతమైన రివ్యూస్ వినవస్తున్నాయి. ఇక జానర్ విషయంలో రెండు సినిమాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. ఇవే సినిమా అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఒకటి స్పై యాక్షన్ అయితే.. మరొకటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రెండు సినిమాలకూ కంటెంటే కీలకం. ప్రేక్షకులకు ఏ సినిమా కథ నచ్చితే అదే టాప్. అయితే ప్రి బుకింగ్స్ విషయంలో ‘కూలీ’దే పైచేయి అనడంలో సందేహం లేదు. మరి సినిమా రిలీజ్ అయ్యాక దేనిది పైచేయి ఉంటుందో చూడాలి. రేస్ అయితే గట్టిగానే నడుస్తోంది.
ప్రజావాణి చీదిరాల