Entertainment

Biggboss9: వీళ్లనెక్కడి నుంచి తెచ్చారో ఏమో.. అంతా డ్రామా ఆర్టిస్టులే..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులైతే నానా తంటాలు పడుతున్నారు. కానీ హౌస్‌లో చూస్తే మాత్రం అంతా డ్రామా ఆర్టిస్టులే.

Biggboss9: వీళ్లనెక్కడి నుంచి తెచ్చారో ఏమో.. అంతా డ్రామా ఆర్టిస్టులే..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 (Biggboss Telugu Season 9)ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ (Biggboss) నిర్వాహకులైతే నానా తంటాలు పడుతున్నారు. కానీ హౌస్‌లో చూస్తే మాత్రం అంతా డ్రామా ఆర్టిస్టులే. ఒకరిని మించి మరొకరు యాక్టింగ్. ఇక వీరిలో తెలుగు తెలియని వారు కొందరు. వారికి ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాదు. వారి వే వారిదే. గుడ్డు ఎపిసోడ్‌లో తనూజ పుట్టస్వామి (Tanuja Puttaswamy), భరణి (Actor Bharani) ఇద్దరూ ఎంత చక్కగా తమకు తెలియదంటూ డ్రామా ప్లే చేశారో.. ఆ తరువాత నిన్నటి ఎపిసోడ్‌కి వస్తే.. హరీష్ (Harish), మర్యాద మనీష్ (Maryada Manish) ఇద్దరూ ఇద్దరేనని అనిపించారు. మనీష్ విషయానికి వస్తే ఏం జరుగుతుందనేది చక్కగా అనాలిసిస్ చేయగలడు. చేసి చెబుతున్నాడు కదా. అలాంటి వ్యక్తి తనకు తాను హైప్ ఇచ్చుకుంటాడు.. నాకు ఎవ్వరితో సంబంధం లేదంటాడు. అంతా ఫేక్ అన్నట్టుగా మాట్లాడతాడు. తనొక్కడినే జెన్యూన్ అని కలరింగ్ ఇస్తాడు. ఇంతా చేసి కెప్టెన్సీ టాస్క్‌లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏం చేశాడనేది చూడకుండానే తాను చూశానని అబద్ధం చెప్పేశాడు.

జెండర్ డిఫరెన్స్ ఏంటి?

నెక్ట్స్.. హరీష్ విషయానికి వస్తే ఈయన కూడా అంతే.. తాను మాత్రమే జెన్యూన్. తాను మాత్రమే ఏదైనా జరిగితే ఎక్కడి వరకైనా వెళతాననే ధోరణిలో వెళ్లిపోతున్నాడు. అతని మాటలు జనాల్లోకి ఎలా వెళతాయనే స్పృహ కూడా లేదు. ఇంతజేసి తను ఎవ్వరికీ లొంగను.. తను ఎవ్వరినీ కేర్ చేయనని చెప్పి సంజన (Sanjana Garlani) కెప్టెన్ అవగానే ఆమెకు దగ్గరయ్యేందుకు నానా తంటాలు పడుతున్నాడు. అది చాలదన్నట్టుగా జెండర్ డిఫరెన్సెస్. తాను నలుగురు లేడీస్‌తో ఆడానన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోందట. భరణిని కూడా లేడీని చేసేశాడు. అసలు లేడీస్ అంటే అంత చులకన భావన ఇతనికేంటో అస్సలు అర్థమే కాదు. ఇలాంటి వారు ఎక్కువ కాలం బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో కొనసాగలేరన్నది మాత్రం వాస్తవం. ఇక సంజన. అసలు ఈమె ఏంటనేది ఎవ్వరికీ అంతుబట్టదు. కానీ అన్నీ కావాలనే చేస్తోందని మాత్రం అర్థమవుతుంది. ఫుటేజ్ మొత్తం తన కేంద్రంగానే జరిగేలా ప్లాన్ చేసుకుంటోంది.. అలాగే చేస్తోంది కూడా. పైగా కెప్టెన్ అయ్యాక తను చెప్పిన పనులు చేయకుంటే కాన్సీక్వెన్సెస్ ఫేస్ చేయాలంటూ బెదిరింపులు. తనను తాను మహారాణిలా ఊహించుకుంటోంది.

తనను తానే కోల్పోతున్నాడు..

ఇక తనూజ పుట్టస్వామి.. ఉల్లిపాయ పచ్చడి చేయమంటే.. ఉల్లిపాయలు వేసి టమాట పచ్చడి చేస్తోంది. అలా కాదు.. ఫుడ్ విషయంలోనే గొడవలు అవుతున్నాయి కదా.. ఇది టమాట పచ్చడి అవుతుంది.. పాయింట్ అవుట్ చేస్తారంటే.. వినదే. తననేదో పవన్ తప్పుబడుతున్నాడన్నట్టుగా మాట్లాడుతోంది. ఎవరెంత చెప్పినా అసలు విషయం మాత్రం ఆమె బుర్రకి ఎక్కడం లేదు. దీనికి లాంగ్వేజ్ కూడా ఒక కారణం కావొచ్చు. తరువాత భరణి.. ఆయనేంటనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. గత సీజన్‌లో శివాజీ (Shivaji) మాదిరిగా ఉండేందుకు అయితే ట్రై చేస్తున్నాడని అర్థమవుతోంది. అందరితో మంచి అనిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో తనను తాను కోల్పోతున్నాడు. తనలా ఉంటేనే కదా.. జనాలు ఆదరించేది. ఈ విషయం అతనికెలా అర్థమవుతుందో తెలియట్లే. సింగర్ కమ్ డ్యాన్సర్ రాము (Singer Ramu).. ఇతనిలో కాస్త పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) షేడ్స్ ఇతనిలో ఉన్నాయేమో అనిపిస్తోంది. అతనేంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

ఈయనో పెద్ద సెలబ్రిటీ..

కెప్టెన్సీ టాస్క్‌లో మాత్రం విన్నర్ కంటే కూడా అప్రిషియేట్ చేయాల్సిన క్యాండిడేట్ రామునే. ఇమ్మాన్యుయేల్ (Immanuel) మాత్రం పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ అతను కూడా కామన్ మ్యాన్‌లా వారిని చూడలేదు. మనలో ఒకరిలా చూస్తున్నామంటాడేంటి? ఈయనో పెద్ద సెలబ్రిటీ (Celebrity) అన్న ఫీలింగా అర్థం కావడం లేదు. అతిగా ఊహించుకుంటే బొక్కబోర్లా పడతాడనంలో సందేహమే లేదు. ఇక ఫ్లోరా శైనీ (Flora Saini) సుమన్ శెట్టి (, Suman Shetty) హౌస్‌లో ఉన్నారన్న మాటే కానీ వారి వలన పది పైసలు ప్రయోజనం కూడా లేదు. వీరిద్దరూ ఇలాగే ఉంటే డేంజర్‌ జోన్‌లోకి లాగి బిగ్‌బాసే బయటకు పంపిస్తాడనంలో సందేహమే లేదు. ఇక పవన్ కల్యాణ్, డెమాన్ పవన్ ఇద్దరూ ఇప్పటి వరకైతే కాస్త జెన్యూన్‌గానే కనిపిస్తున్నారు. ప్రియ (Priya), దమ్ము శ్రీజ (Srija Dammu) ఏంటనేది కూడా పెద్దగా తెలియడం లేదు. ప్రియకు మాత్రం కాస్త నోరు ఎక్కువే. ఇక చూడాలి.. వీరంతా మున్ముందు ఎలా ఉంటారనేది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 13, 2025 5:09 AM