Deepika-Ranveer: దీపిక-రణ్‌వీర్‌ల ప్రేమకథ ఎక్కడ, ఎలా ప్రారంభమైందంటే..
బాలీవుడ్ (Bollywood)లో అందమైన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో ముందుండేది మాత్రం రణ్‌వీర్ సింగ్ (Ranveersingh), దీపికా పదుకొణె (Deepika Padukone) జోడి. వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
బాలీవుడ్ (Bollywood)లో అందమైన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో ముందుండేది మాత్రం రణ్‌వీర్ సింగ్ (Ranveersingh), దీపికా పదుకొణె (Deepika Padukone) జోడి. వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్లు కూడా ఏమీ దాచుకోకుండా.. సందర్భం వచ్చినప్పుడల్లా వారి ప్రేమకథను పంచుకుంటూ ఉంటారు. తాజాగా రణ్‌వీర్‌సింగ్ (Ranveer) తన ప్రేమకథను మరోసారి గుర్తు చేసుకున్నాడు. దీపికతో ఎక్కడ ప్రేమలో పడ్డాడనే విషయాన్ని వెల్లడించాడు. అప్పుడు ఉదయపుర్‌లో ‘రామ్‌లీల’ (Ramleela) షూటింగ్ చేస్తున్నారట. ఆ సమయంలోనే దీపికతో ప్రేమలో పడినట్లు తెలిపారు.
అంతేకాకుండా ఉదయ్‌పుర్ (Udaypur) అనేది ప్రేమకథలకు, ప్రేమికులకు ఒక వరమని రణ్‌వీర్ తెలిపాడు. అందరికీ తానొక ఆసక్తికర విషయం చెప్పాలనుకుంటున్నానని.. ఎన్నో ప్రేమకథలు (Love Stories) ఉదయ్‌పుర్‌లో పుట్టాయని రణ్‌వీర్ తెలిపాడు. తాను, దీపిక (Deepika) కలిసి నటించిన ‘రామ్‌లీల’ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం ఉదయ్‌పుర్‌లోనే జరిగిందని.. ఆ భారీ షెడ్యూల్‌లోనే తను దీపికతో ప్రేమలో పడినట్టు వెల్లడించాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఇద్దరూ సహజీవనం (Live in Relation with Deepika) చేసిన మీదట.. పెళ్లి పీటలు ఎక్కామని తెలిపాడు. అవన్నీ ఎప్పటికీ మరచిపోలేని తీపి జ్ఞాపకాలని రణ్‌వీర్ వెల్లడించాడు. తమ వివాహమై ఏడేళ్లు అవుతోందని.. తమకు ఒక పాప కూడా జన్మించిందని తెలిపాడు.
తన జీవితంలో ఎంతో అదృష్టాన్ని ఉదయ్‌పుర్ తెచ్చిందని పేర్కొన్నాడు. తనలాగే ఎందరో జీవితాల్లో ఉదయ్‌పుర్ ఆనందాన్ని నింపిందని రణ్‌వీర్ సరదాగా తెలిపాడు. దీపిక, రణ్‌వీర్ కలిసి నటించిన చిత్రం రామ్ లీలా 2013లో విడుదలైంది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి స్నేహం కాస్తా ప్రేమ (Deepika-Ranveer Love)గా మారింది. ఆ తరువాత కొంతకాలం పాటు సహజీవనం చేసిన మీదట 2018లో వీరిద్దరూ వివాహం (Deepika-Ranveer Marriage) చేసుకున్నారు గతేడాది రణ్‌వీర్-దీపిక దంపతులకు పాప పుట్టింది. పాపకు ‘దువా’ (Deepika-Ranveer Daughter Duva) అనే పేరు పెట్టుకున్నారు. ఇటీవలే దువా ఫోటోను సైతం రణ్‌వీర్-దీపిక దంపతులు రివీల్ చేశారు.
ప్రజావాణి చీదిరాల