‘నాగబంధం’ నుంచి సెకండ్ సింగిల్ ఎప్పుడంటే..
'సుర సుర' పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించినట్టుగా తెలుస్తోంది. తొలి పాటకు మాదిరిగానే ఈ పాటకు కూడా భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లు ఉండబోతున్నట్టు సమాచారం.
దర్శకుడు అభిషేక్ నామా, విరాట్ కర్ణా కాంబోలో రూపొందుతున్న చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో పౌరాణిక కథ, చరిత్ర, యాక్షన్‌తో పాటు బలమైన ఎమోషన్స్, సాంస్కృతిక అంశాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సెకండ్ సింగిల్ “సుర సుర” (తెలుగు)ను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ప్రేక్షకులను ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
'సుర సుర' పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించినట్టుగా తెలుస్తోంది. తొలి పాటకు మాదిరిగానే ఈ పాటకు కూడా భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లు ఉండబోతున్నట్టు సమాచారం. ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, ఫోక్ ఎలిమెంట్స్‌ను సినిమాటిక్ ఆర్కెస్ట్రేషన్‌తో కలిపి ఫెస్టివ్ సాంగ్‌గా తీర్చిదిద్దారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్. అనురాగ్ కులకర్ణి, కాల భైరవ, మంగ్లీ, సహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ వంటి గాయకులు ఈ పాటకు వోకల్స్ అందించడంతో పాట ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది. ‘సుర సుర’ పాటతో ఫెస్టివ్ వైబ్‌ను మేకర్స్ అందించున్నారు. నభా నటేష్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతి బాబు, గరుడ రామ్, మహేష్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.