Entertainment

Biggboss9: ఈ గుడ్డు గొడవేంటి బాబోయ్.. ఇది బిగ్‌బాస్ హౌసేనా?

ఒక గుడ్డు కోసం కూడా పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తారా? అంటే చేస్తారు. సర్వసాధారణంగా బయటైతే చేయరేమో కానీ బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం అంతకు మించే చేస్తారు. అవసరమైతే కొట్టుకునే వరకూ వెళతారు.

Biggboss9: ఈ గుడ్డు గొడవేంటి బాబోయ్.. ఇది బిగ్‌బాస్ హౌసేనా?

ఒక గుడ్డు (Egg) కోసం కూడా పెద్ద ఎత్తున రాద్దాంతం చేస్తారా? అంటే చేస్తారు. సర్వసాధారణంగా బయటైతే చేయరేమో కానీ బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో మాత్రం అంతకు మించే చేస్తారు. అవసరమైతే కొట్టుకునే వరకూ వెళతారు. రాత్రి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Biggboss Telugu Season9) చూసిన వారందరికీ చిర్రెత్తుకొచ్చి ఉంటుంది. గుడ్డు కోసమా? అంటే బయట పది రూపాయల కోసం కూడా మర్డర్లు జరిగిన దాఖలాలు లేవా? అనవచ్చేమో.. వాళ్లు చదువూ సంధ్యా లేనివాళ్లు. మరి వీళ్లకేమైంది. ఒక రియాలిటీ షో (Reality Show)లో ఉన్నామే. మనల్ని లక్షల మంది చూస్తున్నారే అనే కనీసం జ్ఞానం కూడా లేకుండా గుడ్డు కోసం నానా రచ్చ.

ఎంత డ్యామేజ్ జరిగినా డోంట్ కేర్..

నిజంగా ఈసారి బిగ్‌బాస్‌ (Biggboss) మాత్రం చాలా పేలవంగా ఉంది.. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే బిగ్‌బాస్‌ షో (Biggboss Show)కు ఎవరైనా న్యాయం చేస్తున్నారా. అంటే కళ్లు మూసుకుని చెప్పేయవచ్చు.. అది సంజనా మాత్రమేనని. ఫుటేజ్ ఇవ్వడంలో ఈమెను మించిన వారు లేరు. చూసేవారికి కొందరికి చిరాకేయవచ్చు గాక.. కానీ హౌస్‌లో గొడవలన్నీ మాత్రం ఈమె కారణంగానే అవుతాయి. ఆమె అనుకున్నది చేసేస్తుందంతే.. దాని వలన ఎంత డ్యామేజ్ జరిగినా డోంట్ కేర్ అనేస్తుంది. వాష్ రూంలో తన షాంపూ, కండీషనర్ పెట్టుకుని తీరాల్సిందే.. తగ్గేదే లేదంటూ మిగిలిన హౌస్‌మేట్స్ అందరితో గొడవకు దిగింది. ఒకరోజంతా ఇదే రచ్చ. ఇక నిన్నంతా గుడ్డు గొడవ. దీనికి కూడా సంజనా (Actress Sanjana Garlani)యే కారణం.

ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ వార్..

బిగ్‌బాస్ హౌస్‌ని ఓనర్స్ (Owners), టెనెంట్స్ (Tenants) అనే రెండు విభాగాలుగా విడదీసి గేమ్ ఆడిస్తున్నారు. ఓనర్స్ వచ్చేసి కామనర్స్ కేటగిరి నుంచి వచ్చినవారు. టెనెంట్స్ వచ్చేసి సెలబ్రిటీలు (Celebrities). ఓనర్స్‌కి ఫుడ్ తయారు చేసి పెట్టే బాధ్యత భరణి (Actor Bharani), తనూజ పుట్టస్వామి (Tanuja Puttaswamy)ది. వారిద్దరూ కలిసి ఓనర్స్ కోసం నాలుగు గుడ్లు ఉడకబెట్టగా.. దానిలో ఒక గుడ్డు మిస్ అయ్యింది. ఇక అంతే రచ్చ స్టార్ట్. గుడ్డు పోయిందంటూ హడావుడి మొదలైంది. చివరిగా గుడ్డు తీసింది సంజనా అని తేలింది. ఈ నేపథ్యంలో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ పెద్ద వారే నడిచింది. అయితే సంజనా మాత్రం ఇల్లు తగలబడి పోతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చొన్న నీరో చక్రవర్తి మాదిరిగా అందంగా ముస్తాబై నవ్వుతూ కూర్చొండిపోయింది. అది కంటెస్టెంట్స్ అందరికీ మరింత ఆగ్రహం తెప్పించింది.

నిప్పు పెట్టి చోద్యం చూస్తూ..

ఈ గొడవ కాస్తా ముదిరి భరణి వర్సెస్ హరీష్ కాసేపు నడిచింది. తొలుత గుడ్డు ఎవరు లేపేశారో తెలియదని భరణి, తనూజ చెప్పారు. ఆ తరువాత సంజన తాను వారిద్దరికీ చెప్పే తీసుకున్నానని చెప్పి మరింత అగ్గికి ఆద్యం పోసింది. చివరకు వారిద్దరూ కూడా తమకు తెలుసని ఒప్పుకున్నారు. డెలివరీ అయిన 5 నెలలకే తాను బిగ్‌బాస్‌కి వచ్చానని ఆకలికి ఆగలేక తిన్నానంటూ సంజన వారికి చెప్పిందట. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్ మొత్తం నిప్పు పెట్టి మరీ చోద్యం చూస్తూ ఉండిపోయింది సంజన. ఆసక్తికర విషయం ఏంటంటే.. సంజన పెట్టిన మంటకు ఒకరకంగా ఇల్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే వరకూ వెళ్లిపోయింది.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 11, 2025 4:51 AM