Entertainment

Priyanka Arul Mohan: డీసీఎం అయ్యాక పవన్‌లో వచ్చిన మార్పేంటంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.

Priyanka Arul Mohan: డీసీఎం అయ్యాక పవన్‌లో వచ్చిన మార్పేంటంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 25 (OG Movie Release)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ప్రియాంక (Priyanka) విలేకరులకు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రియాంక కణ్మని పాత్రలో నటిస్తోంది. ‘ఓజీ’ అనేది రెండేళ్ల ప్రయాణమని.. తనకు అదొక మరచిపోలేని జర్నీ అని ప్రియాంక తెలిపింది. ముఖ్యంగా పవన్‌ (Pawan)తో మూవీ అంటే బ్లెస్డ్ అనిపిస్తుందని వెల్లడించింది.

మరి ఈ కన్నడ భామకు పవన్ గురించి ముందే తెలుసా? అంటే ఈ సినిమా ప్రయాణం రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది కదా.. అప్పుడు పవన్ డిప్యూటీ సీఎం (Deputy CM Pawan Kalyan) కూడా కాదు... నటుడిగా మాత్రమే తెలిసి ఉండాలని ప్రశ్నించగా.. ఆమె ఇచ్చిన సమాధానం ఆసక్తికరం. పవన్ క్రేజ్ (Pawan Craze) బియాండ్ ది రీజియన్ అని చెప్పుకొచ్చింది. అప్పుడు పవన్ గురించి కొంత మేర తెలుసని.. సినిమా ప్రారంభమైన తర్వాత పవన్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోయానని తెలిపింది. పవన్‌తో నటించడం.. ఆయన ప్రెజెన్స్‌లో ఉండటం వంటివి తనకు చాలా అద్భుతంగా అనిపించాయని వెల్లడించింది.

పవన్ అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారని తెలిపింది. షూటింగ్ (OG Shooting) సమయంలో బ్రేక్ వస్తే ఎన్నో విషయాలను చర్చించేవారట. ప్రజలు, రాజకీయం, చదివిన బుక్స్, యూత్ ఎలా ఉండాలి వంటి ఎన్నో విషయాల గురించి పవన్ ముచ్చటించేవారని చెప్పుకొచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అవడానికి ముందే ఈ సినిమా ప్రారంభమైంది. అయితే డీసీఎం అయిన మీదట కూడా ఈ సినిమా జర్నీ కొనసాగింది. డిప్యూటీ సీఎం అయ్యాక అవక ముందు తేడా ఏంటంటే.. అవకముందు.. ఎప్పుడూ ఆలోచిస్తూ.. పుస్తకాలు చదువుతూ ఉండేవారట. ముంబై లేదంటే పూణెలో షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో రాజకీయాల గురించి ఆలోచించేవారు. ఇక డీసీఎం అయ్యాక పవన్ రిలాక్స్ అయ్యారు. కాస్త నవ్వుతున్నారని ప్రియాంక చెప్పుకొచ్చింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 16, 2025 10:42 AM