Entertainment Breaking News

మన రౌడీ హీరోకు దక్కిన అరుదైన గౌరవమిది..!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అవమానాలనేవి సర్వసాధారణం.. వాటిని అభరణాలనుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. మరి విజయం ఆ ఒంటి పేరులోనే ఉంటే..

మన రౌడీ హీరోకు దక్కిన అరుదైన గౌరవమిది..!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెడితే అవమానాలనేవి సర్వసాధారణం.. వాటిని అభరణాలనుకుని ముందుకు సాగితేనే విజయం వరిస్తుంది. మరి విజయం ఆ ఒంటి పేరులోనే ఉంటే.. ఆపడం ఎవరి తరమవుతుంది? అవమానాలను ఎదుర్కోకుండా ఎవరూ ఏ రంగంలోనూ రాణించలేరు. కానీ అలా చీతార్కాలు పొందిన చోటే మంచి స్టార్‌డమ్‌తో నిలబడి చప్పట్లు కొట్టించుకుంటే వచ్చే కిక్కే వేరు. పెద్దగా టైమ్ తీసుకోకుండానే ఇండస్ట్రీలో నిలదొక్కుకుని హీరోగా రెండో సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? ఓవర్ నైట్ స్టార్ అయిపోతే ఆ మజాయే వేరు.. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

ఒకప్పుడు తన సినిమాను విడుదల చేసుకోవడానికి నానా తంటాలు, అవమానాలను ఎదుర్కొన్న మన రౌడీ హీరో (Rowdy Hero) ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తన చిత్రాలను విడుదల చేస్తున్నాడు. తెలుగు (Telugu)లోనే కాదు.. తమిళ (Tamil), కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నాడు. ప్రస్తుతం మన రౌడీ హీరో రేంజే మారిపోయింది. ఈ టాలీవుడ్ సెన్సేషన్.. అమెరికా (America)లోని న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో గ్రాండ్ మార్షల్‌గా పాల్గొనడం విశేషం. ‘సర్వే భవంతు సుఖినః’ అనే థీమ్‌తో ఈ వేడుక ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో మాడిసన్ అవెన్యూలో అట్టహాసంగా జరిగింది. దీనికి గ్రాండ్ మార్షల్‌గా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వ్యవహరించడం విశేషం.

ఆసక్తికర విషయం ఏంటంటే..

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వేడుకల్లో గ్రాండ్ మార్షల్‌గా పాల్గొన్న రౌడీ హీరోని చూసి ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ వేడుకలో స్థానిక అమెరికన్స్ మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు సైతం పాల్గొన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ వేడుక జరిగిన ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ మొత్తం మన జాతీయ జెండా (National Flag)లోని మూడు రంగుల విద్యుత్ దీప కాంతులతో మిరుమిట్లు గొలిపింది. అక్కడి ప్రవాస భారతీయుల్లో (Indians) జాతీయ భావాన్ని తట్టి లేపింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మువ్వన్నెల లైటింగ్‌కు విజయ్ దేవరకొండే (Vijay Devarakonda) స్విచ్ఛాన్ చేశారు. ఎందరో స్టార్ హీరోలకు దక్కని అరుదైన గౌరవం విజయ్‌కు దక్కిందనే చెప్పాలి.

వారి కాంట్రిబ్యూషన్ చూస్తుంటే..

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అమెరికాలోని ప్రవాస భారతీయ సోదరులు మన దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారని పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై మన జాతీయ పతాకంలోని మూడు రంగులను చూడటం మనసుకు ఆనందాన్నిచ్చిందని అన్నారు. దేశం కోసం ప్రవాస భారతీయులు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా అనిపించింని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగానే మనం ఆనందంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నామని విజయ్ దేవరకొండ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 17, 2025 12:19 PM