Entertainment

Janhvi Kapoor: పుడితే జాన్వీలా పుట్టాలిరా బాబు.. స్విమ్మింగ్ పూలే అలానా..!

పుడితే ఇలా పుట్టాలిరా బాబు.. అనిపిస్తుంటుంది కొందరి చూస్తే.. వీళ్లు గోల్డెన్ స్పూన్ కూడా కాదు.. ఏ డైమండ్ స్పూన్‌తో పుట్టి ఉంటారేమో అని కూడా అనిపిస్తుంది.

Janhvi Kapoor: పుడితే జాన్వీలా పుట్టాలిరా బాబు.. స్విమ్మింగ్ పూలే అలానా..!

పుడితే ఇలా పుట్టాలిరా బాబు.. అనిపిస్తుంటుంది కొందరి చూస్తే.. వీళ్లు గోల్డెన్ స్పూన్ కూడా కాదు.. ఏ డైమండ్ స్పూన్‌తో పుట్టి ఉంటారేమో అని కూడా అనిపిస్తుంది. ఇంతకీ అంతటి అదృష్టవంతుడు లేదంటే అదృష్టవంతురాలు ఎవరు అంటారా? ఇంకెవరుంటారు? మన అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. ఈ ముద్దుగుమ్మ లగ్జరీ కారు, ఇల్లే కాదండోయ్.. అమ్మడి స్విమ్మింగ్ పూల్ సైతం మైండ్ బ్లాకే..

దివంగత నటి శ్రీదేవి (Legendary Actress Sridevi) వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్‌ (Janhvi Kapoor)కు తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు పెద్దగా సమయం ఏమీ పట్టలేదు. బాలీవుడ్‌ (Bollywood)లో పెద్దగా సక్సెస్ రేట్ లేకున్నా కానీ టాలీవుడ్‌ (Tollywood)లో మాత్రం అమ్మడికి ‘దేవర (Devara)’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) సరసన ‘పెద్ది (Peddi)’ చిత్రంలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా (Social Media) క్వీన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంపై హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే సెలబ్రిటీలంతా ఒకటే దారి.. డబ్బు చేతికి వచ్చిందా? వెనుకా ముందూ చూసుకోకుండా ఎంజాయ్ చేస్తుంటారు. అన్నీ బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇల్లు, కారు లగ్జరీగా ఉండేలా చూసుకుంటారు.

తాజాగా జాన్వీకపూర్‌కు సంబంధించిన ఓ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మడి విలాసవంతమైన ఇంటికి సంబంధించిన న్యూస్ అది. అసలు ఇంటి కంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. అమ్మడి స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) గురించి. రచ్చంతా దీని చుట్టూనే. అమ్మడి ఇల్లు ముంబై (Mumbai)లోని బాంద్రాలో ఉంది. సెలబ్రిటీల ఇళ్లన్నీ దాదాపుగా ఈ ప్రాంతంలోనే ఉంటాయనుకోండి. వాటిలో ఈ ముద్దుగుమ్మ బంగ్లా వెరీ స్పెషల్. బాంద్రాలో 8,669 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.65 కోట్ల విలువ చేసే లగ్జరీ ఇంట్లో జాన్వీకపూర్ నివసిస్తోంది. ఈ ఇంటికి సంబంధించి ప్రతిదీ ప్రత్యేకమే. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్విమ్మింగ్ పూల్ గురించి. జాన్వీకి కూడా తన స్విమ్మింగ్ పూల్ అంటేనే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రైవేట్ గార్డె‌న్‌తో రిసార్ట్‌ను తలదన్నేలా ఆమె స్విమ్మింగ్ పూల్ ఉంటుందట.

ఇంట్లో ఉంటే స్విమ్మింగ్‌ పూల్‌లో ఉండేందుకే ఎక్కువగా జాన్వీ సమయాన్ని కేటాయిస్తుందట. స్విమ్మింగ్ పూల్ చుట్టూ గ్రీనరీ ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో ఉండే ఆ స్విమ్మింగ్‌ పూల్‌‌లో గడుపుతుంటే మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోతుందట. ఇక స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకతలేంటంటే.. దీనికి అమీబా మాదిరిగా ఓ ఆకారం అంటూ ఏమీ ఉండదు. ఎటు వైపు నుంచి చూసినా కూడా ఒకే రకమైన షేప్‌లో కనిపిస్తూ ఉంటుందట. అలా చాలా ప్రత్యేకంగా ఉండేలా స్విమ్మింగ్‌ పూల్‌ను డిజైన్ చేయించుకున్నట్టు జాన్వీ సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మొత్తానికి అమ్మడు స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పిన వివరాలతో హాట్ టాపిక్ అయిపోయింది. ఇక ఇంట్లో కూడా ప్రతి గది చాలా ప్రత్యేకంగా ఉంటుందట.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 13, 2025 7:18 AM