Sidhu Jonnalagadda: వైవా హర్ష సీన్‌ను లేపేశాం..
స్టోరీని లాక్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేసినట్టు సిద్దు (Sidhu Jonnalagadda) తెలిపాడు. తను వరుణ్ అనే పాత్రలో నటించానని.. తను మామూలుగానే కనిపిస్తాను కానీ తన ఆలోచనలు మాత్రం చాలా ర్యాడికల్‌గా ఉంటాయని చెప్పుకొచ్చాడు.

మిరాయ్ (Mirai) లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' (Telusu Kada(తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. నీరజా కోన దర్శకత్వంలో (Director Neeraja Kona) స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Star Boy Sidhu Jonnalagadda) హీరోగా నటించిన చిత్రమిది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), రాశి ఖన్నా (Rashi Khanna) హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిద్దు జొన్నలగడ్డ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ఈ సినిమా కథను నీరజ ఏడాదిన్నర క్రితమే తనకు చెప్పారని అది విన్నాక చాలా ఎక్సైట్ అయ్యానని సిద్దు తెలిపాడు. అయితే క్యారెక్టరైజేషన్ మీద ఇంకా వర్క్ చేయాల్సి ఉందని అప్పుడు చెప్పాడట. దీనికి కారణం ఏంటంటే.. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత అనుకుంటున్న సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే బాగుంటుందని అనుకున్నారట. అలా ముందుగా స్టోరీని లాక్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేసినట్టు సిద్దు (Sidhu Jonnalagadda) తెలిపాడు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా.. హ్యూమర్‌తో ఉంటూ ఆడియన్స్‌ను షాక్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. సినిమాకు ట్రైలర్ (Telusu Kada Trailer) రిలీజ్ తర్వాత అద్భుతమైన బజ్ వచ్చిందని తెలిపాడు. తను వరుణ్ అనే పాత్రలో నటించానని.. తను మామూలుగానే కనిపిస్తాను కానీ తన ఆలోచనలు మాత్రం చాలా ర్యాడికల్‌గా ఉంటాయని చెప్పుకొచ్చాడు.
లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, ఫ్యామిలీ రిలేషన్ షిప్ గురించి డిస్కషన్ సినిమాలో ఉంటుందని.. ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుందని సిద్దు తెలిపాడు. నీరజ ఐడియా చాలా కొత్తగా ఉండటంతో తనకు చాలా నచ్చిందని.. క్యారెక్టర్ సెట్ అయితేనే షూటింగ్ అని ముందుగానే చెప్పానని తెలిపాడు. అలాంటి క్యారెక్టర్ కుదిరిన తర్వాతే షూట్ స్టార్ట్ చేసినట్టు వెల్లడించాడు. ట్రైలర్‌లో ఉన్న కంటెంట్ సినిమాలో లేదంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన సిద్దు.. ట్రైలర్‌లో ఉన్న ప్రతి సీన్ సినిమాలో ఉంటుందని.. ట్రైలర్ చివరిలో వైవా హర్ష సీన్ తప్పితే మిగతా అన్ని సీన్లు సినిమాలో ఉంటాయని చెప్పుకొచ్చాడు. మంచి కథ దొరికితే రవితేజ (Hero Raviteja)తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సిద్దు వెల్లడించాడు. ఇక సినిమాలో శ్రీనిధి, రాశి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని.. ముఖ్యంగా రాశి సెకండ్ హాఫ్‌లో ఒక సీన్‌లో ఆడియన్స్‌ని పిచ్చి సర్‌ప్రైజ్ చేస్తుందని సిద్దు తెలిపాడు. తన క్యారెక్టర్ విషయానికి వస్తే సినిమాలో 23 నిమిషం తర్వాత ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుందని సిద్దు వెల్లడించాడు.
ప్రజావాణి చీదిరాల