Rajasaab: చిరుకు ఫేవర్ చేసేందుకు ప్రభాస్‌ను బలి చేశారా?
ప్రభాస్‌ను కావాలనే బలి చేశారా? అదేనండీ టార్గెట్ చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి కోసమే జరిగిందా? అసలు ప్రభాస్‌కు, చిరంజీవికి ఏంటి సంబంధం అంటారా?
ప్రభాస్‌ను కావాలనే బలి చేశారా? అదేనండీ టార్గెట్ చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి కోసమే జరిగిందా? అసలు ప్రభాస్‌కు, చిరంజీవికి ఏంటి సంబంధం అంటారా? ఇద్దరూ పెద్ద హీరోలే.. అంతకు మించి ఏం లేదు. కానీ ఒకే రోజు తెలంగాణలో రెండు సినిమాల మెమోలు తయారయ్యాయి. కానీ ప్రభాస్ సినిమా మెమోను చివరి వరకూ ఆపి విడుదల చేశారని టాక్. మరి చిరంజీవి సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించిన మెమోను 8వ తేదీన తయారు చేశారు. వాస్తవానికి ‘రాజాసాబ్’ మెమోతో పాటు దీనిని కూడా విడుదల చేయాలి. కానీ దాచేశారంటండోయ్.
నిజమే.. చిరు సినిమాకు సంబంధించిన మెమోను ఇవాళ అంటే జనవరి 10 వరకూ ఆపి మరీ విడుదల చేశారు. చిరంజీవి సినిమా మెమో విడుదల కాకపోవడం వల్ల అప్పటికే విడుదలైన ప్రభాస్ సినిమా జీవోపై మాత్రమే కోర్టులో స్టే విధించడం జరిగింది. అంటే చిరు సినిమాపై ఇక స్టే లేనట్టే. ఎందుకంటారా? సంక్రాంతి పండుగ సందర్భంగా కోర్టు సెలవులు. రేపు ఆదివారం.. ఆపై సంక్రాంతి సెలవులు. ఆ తరువాత కోర్టు తీరికగా స్టే ఇచ్చినా ఏముంటుంది? అప్పటికే అంతా అయిపోతుంది. ఇంతకీ దీనికంతటికీ కారణం ఎవరంటారా? మన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాదులెండి. షాడో సినిమాటోగ్రఫీ మంత్రిగా పిలుచుకునే రోహిణ్ రెడ్డి అని ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు ఫేవర్ చేసేందుకు ‘రాజాసాబ్’ సినిమాను బలి చేశారంటూ రోహిణ్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ మొన్న(8వ తేదీ)నే మెమో తయారు చేశారట. కానీ ప్రభుత్వం దానిని బయటకు విడుదల చేయకుండా దాచేసిందట. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకుండా, అర్ధరాత్రి జీవో విడుదల చేసింది. వాస్తవానికి ‘రాజాసాబ్’ సినిమా టికెట్ ధరల పెంపు మెమోను హైకోర్టు కొట్టేస్తుందని తెలిసే.. చిరు సినిమా జీవోను గోప్యంగా ఉంచారని సమచారం.
ఈ రోజు నుంచి 19వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవులున్నాయి. ఈ నేపథ్యంలో జీవోను కొట్టివేసే అవకాశం లేదు. ఈ విషయం తెలిసే 8వ తేదీన తయారు చేసిన మెమో ఈరోజు విడుదల చేశారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వాస్తవానికి సినీ పరిశ్రమలో వివాదాల జోలికి ఏమాత్రం ప్రభాస్ వెళ్లరు. తన పనేంటో తాను చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనో అజాతశత్రువు. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకింత వివక్ష చూపించారో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా పోయిందన్న బాధ ఒక ఎత్తైతే.. తమ హీరో విషయంలో జరిగిన కుట్ర మరో ఎత్తు. వెరసి ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.
ప్రజావాణి చీదిరాల