Entertainment

Viswanath & Sons Teaser: ఒక్క చిటికెయ్ చాలు.. చాలా మంది పడిపోతారు..

‘‘మనం గొప్ప అనుకున్న ప్రతిసారీ మనకన్నా గొప్పోడు ఒకడుంటాడని దేవుడు గుర్తు చేస్తాడు’’ అంటూ ఆసక్తికర డైలాగ్స్‌తో ఈ టీజర్‌ను మేకర్స్ కట్ చేశారు.

Viswanath & Sons Teaser: ఒక్క చిటికెయ్ చాలు.. చాలా మంది పడిపోతారు..

ప్రస్తుత తరుణంలో స్టోరీకే ప్రాధాన్యత. ఇంట్రస్టింగ్‌గా ఉంటే చాలు.. ప్రేక్షకుల ఓటు పడిపోతుంది. తాజాగా ‘విశ్వనాథ్ & అండ్ సన్స్’ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. అది చూస్తే ఒక మంచి స్టోరీతోనే సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మమితా బైజు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. 20 ఏళ్ల వయసున్న యువతి.. 40 ఏళ్ల వ్యక్తిపై మనసు పడుతుంది. ఈ నేపథ్యంలో కథను చాలా ఆసక్తికరంగా మలిచినట్టుగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. డైలాగ్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

‘‘మనం గొప్ప అనుకున్న ప్రతిసారీ మనకన్నా గొప్పోడు ఒకడుంటాడని దేవుడు గుర్తు చేస్తాడు’’ అంటూ ఆసక్తికర డైలాగ్స్‌తో ఈ టీజర్‌ను మేకర్స్ కట్ చేశారు. ‘‘సంజయ్‌ విశ్వనాథ్‌ గతంలో ఎన్నో పిస్టల్‌ కాంపిటేషన్స్‌లో గెలిచారు. కానీ, ఇప్పుడు వేరు. కంటి చూపుకి 20ల్లో ఉన్న ఫిట్‌నెస్‌ 40 దాటాక ఉండదు’’ అనే డైలాగ్‌తో సూర్య పాత్రను టీజర్‌లో ప్రెజెంట్ చేశారు. ఇక మమితా బైజు.. మ్యాడీగా నటించింది. మ్యాడీ వయసులో తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకుంటుంది. కానీ విశ్వనాథ్ దానికి అంగీకరించడు. కథతో పాటు వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్. టీజర్ చివరిలో ‘‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు’’ అని సూర్య చెబుతాడు. ‘‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలేస్తా. నువ్వు పడు చాలు’’ అంటూ మమిత బదులివ్వడం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 17, 2026 3:04 AM