Vishwanath & Sons: షుగర్ డాడీ అంశాన్ని కథగా తీసుకున్నారా?
అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా, రకుల్ ప్రీత్ సింగ్ 20 ఏళ్ల యువతిగా నటించారు. వయస్సులో వీరిద్దరికీ భారీ తేడా ఉంది. ఆ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది
‘విశ్వనాథ్ & అండ్ సన్స్’ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ టీజర్ చూసిన వారంతా కొందరు బాలీవుడ్ చిత్రానికి నకలులా ఉందంటే.. మరికొందరు మాత్రం షుగర్ డాడీ కల్చర్‌ను చిత్రంలో చూపించబోతున్నారంటున్నారు. ఇంతకీ అసలు ఈ చిత్ర కథ దేనికి మ్యాచ్ అవుతోందంటారా? వాస్తవానికి బాలీవుడ్‌లో ‘దే దే ప్యార్ దే’ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.
అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా, రకుల్ ప్రీత్ సింగ్ 20 ఏళ్ల యువతిగా నటించారు. వయస్సులో వీరిద్దరికీ భారీ తేడా ఉంది. ఆ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. దీంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన సీక్వెల్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ఇండియాలోనే కాకుండా.. హైదరాబాద్‌లోనూ షుగర్ డాడీ - షుగర్ మమ్మీ కల్చర్ పెరిగిపోతోంది. షుగర్ డాడీ - షుగర్ మమ్మీ కల్చర్ సంగతేంటంటే.. ఆర్థికంగా అత్యంత ధనవంతులైన వృద్ధులు, వారు తమ కంటే వయసులో చాలా చిన్నవారైన యువతీ యువకులకు డబ్బు, విలాసవంతమైన వస్తువులు, లేదా కెరీర్ సపోర్ట్ అందిస్తూ, బదులుగా శృంగార లేదా సామాజిక సాంగత్యాన్ని పొందుతారు. ఇది కూడా ఒక రకమైన డేటింగే. అయితే ఆధునిక డేటింగ్ అని చెప్పాలి.
ఈ కాన్సెప్ట్‌తోనే ‘విశ్వనాథ్ & అండ్ సన్స్’ చిత్రం రూపొందిందని టాక్. హీరోయిన్ మ్యాడీ (Mamitha Baiju) వయసులో తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకుంటుంది. కానీ విశ్వనాథ్ (Hero Surya) దానికి అంగీకరించడు. వీరిద్దరి మధ్య సాగే ప్రేమకథను ప్రధానాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. టీజర్ చివరిలో ‘‘నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు’’ అని సూర్య చెబుతాడు. ‘‘కావాలంటే ఇంకో నాలుగు చిటికెలేస్తా. నువ్వు పడు చాలు’’ అంటూ మమిత బదులిస్తుంది. ఈ డైలాగ్స్ అన్నీ షుగర్ డాడీ కాన్సెప్ట్‌కు దగ్గరగా ఉన్నాయని అంతా అంటున్నారు. ఇక ట్రైలర్ వస్తే కానీ సినిమాపై ఓ అంచనాకు రాలేం.