Entertainment

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ఫైర్.. కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారా?

నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు మైక్ పట్టుకుంటే ఆయనకు ఏమవుతుందో ఏమో కానీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్శీ చేసుకుంటున్నారు. అసలు కాంట్రవర్శీయే ఆయనను వెదుక్కుంటూ వస్తోందో..

Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ఫైర్.. కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారా?

నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు మైక్ పట్టుకుంటే ఆయనకు ఏమవుతుందో ఏమో కానీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్శీ చేసుకుంటున్నారు. అసలు కాంట్రవర్శీయే ఆయనను వెదుక్కుంటూ వస్తోందో.. లేదంటే ఆయనే కాంట్రవర్శీని వెదుక్కుంటూ వెళుతున్నారో కానీ మొత్తానికి కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారు. తాజాగా మరోసారి కాంట్రవర్శీ వ్యాఖ్యలు చేసి తమిళ నటులకు ఆగ్రహం తెప్పించారు. భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్‌కు ‘కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం 2025’ని ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో మైక్ అందుకున్న రాజేంద్రప్రసాద్... అలనాటి తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావించారు. కాంతారావు గొప్ప నటుడే కానీ ఆ సమయంలో తమిళ సినీ దిగ్గజం, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ను తీసుకొచ్చి ఆయనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని.. ఉచ్చ పోసుకునే వారంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారాయి. దీనిపై కొందరు నటులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా హీరో విశాల్ దీనిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను చూసి, విని దిగ్భ్రాంతికి గురైనట్టుగా విశాల్ తెలిపారు.

ఆయన వ్యాఖ్యలను విన్న తర్వాత తన గుండె బరువెక్కిందన్నారు. ఎంజీఆర్‌ తమిళనాట దిగ్గజ నటుడు మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరుగాంచారన్నారు. అలాంటి వ్యక్తిపై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత ఈ ట్వీట్ చేస్తున్నట్టు తెలిపారు. కాంతారావు గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా బాగున్నాయని.. కానీ అదే సమయంలో ఎంజీఆర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విశాల్ పేర్కొన్నారు. కాబట్టి ఈ కాంట్రవర్శీకి ఫుల్ స్టాప్ పెట్టాలని రాజేంద్రప్రసాద్‌ను ఆయన కోరారు. భవిష్యత్‌లో ఏ నటుడి గురించి చెడుగా మాట్లాడినా కూడా తాను ఇలాగే రియాక్ట్ అవుతానన్నారు. ఈ విషయంపై క్షమాపణ చెబుతారని ఆశిస్తున్నానని విశాల్ పేర్కొన్నారు. మరి రాజేంద్రప్రసాద్ క్షమాపణ చెబుతారా? ఏమో చూడాలి.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 12, 2026 7:50 AM