Entertainment

Vijay Devarakonda - Rashmika: రష్మికకు విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది.

Vijay Devarakonda - Rashmika: రష్మికకు విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఇప్పటికే విజయ్, రష్మికల కుటుంబ సభ్యులంతా ఉదయ్‌పుర్‌కు చేరుకున్నారు. వీరి వివాహ కార్యక్రమానికి విరోష్‌గా పిలుస్తున్నారు. ఈ పేరుతోనే వివాహ వేడుకలు సైతం జరుగుతున్నాయి.

ఉదయపుర్‌లోని లగ్జరీ హోటల్ ఐటీసీ మెమెంటోస్‌లో విజయ్, రష్మికల సంగీత్ వేడుక కన్నుల పండువగా జరిగంది. ఈ వేడుకలో విజయ్, రష్మిక తమ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా తమ డ్యాన్స్‌లతో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది. ఈ హోటల్‌లోని ఒక ప్రత్యేక ప్రదేశంలో ఈ వేడుక జరిగినట్టు సమాచారం. హోటల్​లో ఉన్న అందమైన సరస్సు, ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వేడుక రాయల్‌గా జరిగినట్టుగా టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే పెళ్లి వేడుకకు సంంధించిన ఫోటోలు కానీ.. వీడియోలు కానీ బయటకు రావొద్దని ముందుగానే కండీషన్ ఉండటంతో ఏ ఒక్కటి బయటకు రావడం లేదు.

ఇక ఈ సంగీత్‌లో మరొక స్పెషల్ ఏంటంటే.. విజయ్ తల్లి మాధవి దేవరకొండ తన కాబోయే కోడలికి ఇచ్చిన గిఫ్ట్. తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న ఖరీదైన బంగారు గాజులను ఆమె రష్మికకు బహుమతిగా ఇచ్చారు. ఈ మధురమైన మూమెంట్ సంగీత్‌లోనే హైలెట్‌గా నిలిచింది. తమ సంప్రదాయం ప్రకారం ఇంటికి రాబోయే కోడలికి ఇలాంటి ఆభరణాలు ఇవ్వడం విజయ్ దేవరకొండ కుటుంబ ఆచారమని తెలుస్తోంది. ఈ ఊహించని బహుమతితో రష్మిక చాలా ఎమోషనల్ అయ్యిందట. మొత్తానికి అత్తాకోడళ్ల మధ్య మంచి బాండింగే ఉందని టాక్ నడుస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
February 25, 2026 11:24 AM