Vijay Devarakonda - Rashmika: వేడుకగా విజయ్-రష్మిక వివాహం..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Wedding Of Virosh) కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేసినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Wedding Of Virosh) కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేసినట్లు తెలుస్తోంది. విషయం బయటకు వచ్చిన వెంటనే విజయ్-రష్మిక జంటకు పెద్ద ఎత్తున నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. విరోష్ పెళ్లి వేడుక రెండు సంస్కృతులు, సంప్రదాయాల కలయికగా జరుగుతోంది. ఇవాళ (గురువారం) ఉదయం విజయ్ (VijayDeverakonda) వైపు నుంచి హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.
ఇక రష్మిక కుటుంబ సంప్రదాయం అనంతరం సాయంత్రం 4:30 గంటలకు మరోసారి ఈ జంట వివాహం జరగనుందని తెలిసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే వీరి వివాహ సంబరాల్లో మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. అదేంటంటే.. విజయ్ - రష్మిక ‘విరోష్ ప్రీమియర్ లీగ్’. ఈ పేరుతో సరదాగా ఓ చిన్న క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించినట్లు ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. అలాగే బుధవారం హల్దీ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించినట్లు విరోష్ జోడీ తెలియజేసింది. ఇక వీరిద్దరి రిసెప్షన్ హైదరాబాద్‌లో వేడుకగా జరుగనుంది. మార్చి 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.