Entertainment

Vijay Devarakonda: విజయ్ కారుకు ప్రమాదం.. తలంతా నొప్పిగా ఉందంటూ ట్వీట్

రౌడీ హీరో (Rowdy Hero) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైంది. పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న మీదట విజయ్ తిరుగు ప్రయాణమయ్యాడు. కారు జోగులాంబ గద్వాల వద్దకు రాగానే..

Vijay Devarakonda: విజయ్ కారుకు ప్రమాదం.. తలంతా నొప్పిగా ఉందంటూ ట్వీట్

రౌడీ హీరో (Rowdy Hero) విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయ్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత ఆదివారం పుట్టపర్తి సత్య సాయిబాబా (Puttaparthi Satya Saibaba) మహా సమాధిని దర్శించుకునేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆదివారం మహా సమాధిని దర్శించుకున్నాడు. నేడు అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యాడు. కారు హైదరాబాద్ చేరుకునే క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలోకి రాగానే విజయ్ ప్రయాణిస్తున్న కారును బొలెరో వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడగా ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి విజయ్‌ సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ తన స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. విజయ్‌ కారు డ్రైవర్‌ అందె శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఉండవల్లి ఎస్.ఐ ఆర్.శేఖర్ ధృవీకరించారు. ‘కింగ్డమ్‌’ మూవీ (Kingdom Movie)తో సక్సెస్ అందుకున్న విజయ్ చేతిలో.. ప్రస్తుతం రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrutyan) ప్రాజెక్టుతో పాటు దర్శకుడు రవికిరణ్ కోలా (Director Ravikiran Kola) రూపొందించనున్న ప్రాజెక్టు ఉంది.

అయితే ఈ విషయమై తాజాగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. కారు ప్రమాదానికి గురైంది కానీ తామంతా క్షేమమని తెలిపాడు. ఫుల్‌గా వర్కవుట్స్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చానని వెల్లడించాడు. తన తలంతా నొప్పిగా ఉందని చెప్పాడు కానీ దానికో ఫన్నీ కారణాన్ని విజయ్ వెల్లడించాడు. అదేంటంటే.. తల నొప్పి నిద్ర లేకనా.. లేదంటే బిర్యానీ లేకనా అనే విషయం తెలియడం లేదట. అందరికీ బిగ్గెస్ట్ హగ్స్, లవ్ అని తెలిపాడు. ఈ న్యూస్ కారణంగా ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దని అభిమానులకు విజయ్ దేవరొండ సూచించాడు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 6, 2025 3:53 PM