Entertainment

The Girlfriend: రష్మిక చేతిని ముద్దాడిన విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఈలలు, కేకలు..

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దీక్షిత్‌ శెట్టి (Deekshith Shetty) ముఖ్య పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girl Friend) చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.

The Girlfriend: రష్మిక చేతిని ముద్దాడిన విజయ్ దేవరకొండ.. ఫ్యాన్స్ ఈలలు, కేకలు..

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దీక్షిత్‌ శెట్టి (Deekshith Shetty) ముఖ్య పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girl Friend) చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Arvind) సమర్పణలో గీతా ఆర్ట్స్‌ (Geetha Arts)పై విద్య కొప్పినీడు (Vidya Koppineedu), ధీరజ్‌ మొగిలినేని (Dheeraj Mogilineni) నిర్మించిన ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాహుల్‌ రవీంద్ర (Rahul Ravindran) ఒక అమ్మాయిని గొప్పగా చూపించి హిట్ కొట్టారంటూ అమ్మాయిలంతా చెబుతున్నారు.

ప్రేమకథలో ఒక విభిన్న కోణాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ (Girlfriend Success Meet) జరుపుకుంది. ఈ సక్సెస్ మీట్‌కు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. విజయ్ ఎంటర్ అయిన సమయంలో రష్మిక స్టేజ్‌పై ఉంది. విజయ్ దేవరకొండ వచ్చీ రాగానే చిత్ర యూనిట్‌ను అభినందించి ఆపై అల్లు అరవింద్‌ను హగ్ చేసుకున్నారు. అప్పుడే రష్మిక కూడా స్టేజ్ దిగి కిందకు వచ్చారు. ఆ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అల్లు అరవింద్‌తో విజయ్ మాట్లాడుతున్నా కూడా ఆయన కళ్లన్నీ రష్మిక మీదే ఉన్నాయి.

వెంటనే ఆమె వద్దకు వెళ్లి విజయ్ దేవరకొండ ఆమెను చేతిని తన చేతుల్లోకి తీసుకుని అందరి ముందే ముద్దాడాడు. ఈ సీన్‌ను కెమెరాలన్నీ బంధించగా.. అభిమానులు ఈలలు, కేకలతో హోెత్తిచారు. విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం (Vijay-Rashmika Engagement) ఇటీవలే చాలా సైలెంట్‌గా జరిగిన విషయం తెలిసిందే. అందరి ముందే ఆమె చేతిని ముద్దాడటంతో వారి రిలేషన్‌షిప్ బహిరంగ రహస్యమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media)ను షేక్ చేస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 13, 2025 12:39 PM