Vijay Devarakonda-Rashmika: వివాహం ఈ నెల 26నే..! అసలు ఎందుకంత సీక్రెసీ?
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. అయితే దీనికి రెండు కారణాలని చెబుతున్నప్పటికీ ముఖ్యంగా పెళ్లికి పిలిచేందుకే కలిశాడని టాక్.
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. అయితే దీనికి రెండు కారణాలని చెబుతున్నప్పటికీ ముఖ్యంగా పెళ్లికి పిలిచేందుకే కలిశాడని టాక్. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయానికి అభినందనలు తెలిపేందుకని కూడా టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా ప్రధాన కారణం మాత్రం తన వివాహానికి ఆహ్వానించేందుకేనని తెలుస్తోంది. విజయ్, రష్మికల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 26న జరుగనుంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రిసెప్షన్ నిర్వహించనున్నారు.
పెళ్లికి అయితే రేవంత్ వెళ్లే అవకాశం లేదని అంటున్నారు కానీ రిసెప్షన్‌కు మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు భారీగానే హాజరవనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా వివాహ పత్రికలను పంచేశారని టాక్. అయితే వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకూ రాలేదు. కనీసం ఇన్విటేషన్స్ సైతం అందిస్తున్న వివరాలు సైతం బయటకు రాలేదు. విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్ గతేడాది అక్టోబర్‌లో జరిగిది. అప్పుడే వివాహం ఫిబ్రవరిలో ఉండవచ్చనే టాక్ నడిచింది. అయితే ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటున్నారన తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న వీడియోలు బయటకు రావడంతో వెడ్డింగ్ ఫిక్స్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు విజయ్, రష్మిక తమ ప్రేమ, ఎంగేజ్‌మెంట్, పెళ్లి విషయాలను ఎందుకింత గోప్యంగా ఉంచాలనుకుంటున్నారనేది అర్ధం కావడం లేదు.