Vijay: ‘జయ నాయగన్’ ఈవెంటే సినీ రిటైర్‌మెంట్ ప్రకటనకు వేదిక..
రాజకీయాలు, సినిమా ఒక ఒరలో ఒదిగే రెండు కత్తులు కావనుకున్నారో ఏమో కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. సినిమాలకు సైతం రిటైర్‌మెంట్ ఉంటుందా? అంటే నటులు వద్దనుకుంటే ఉంటుంది.
రాజకీయాలు, సినిమా ఒక ఒరలో ఒదిగే రెండు కత్తులు కావనుకున్నారో ఏమో కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. సినిమాలకు సైతం రిటైర్‌మెంట్ ఉంటుందా? అంటే నటులు వద్దనుకుంటే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘జన నాయగన్’ (Jana Nayagan) చిత్రంలో నటిస్తున్నారు. ఇదే ఆయన ఆఖరి చిత్రమని.. ప్రారంభం నాటి నుంచి టాక్ నడుస్తూనే ఉంది. దానికి తాజాగా క్లారిటీ వచ్చింది. కౌలాలంపూర్ వేదికగా ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌ను తన రిటైర్‌మెంట్ ప్రకటనకు సైతం విజయ్ వేదికగా మలచుకున్నారు. అభిమానుల సమక్షంలో రిటైర్‌మెంట్‌ను ప్రకటించి విజయ్ సడెన్ షాక్ ఇచ్చారు.
తన కోసం ఎందరో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారని.. ఇంతకాలం తనకు సపోర్ట్ అందించిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతానని తెలిపారు. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానంటూ విజయ్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుని ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నో విమర్శలను ఆది నుంచి ఎదుర్కొన్నానని.. తనకు అభిమానుల అండ.. మెండుగా లభించిందన్నారు. ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చానని.. కానీ తనకు అభిమానులు రాజభవనమే ఇచ్చారన్నారు. అంతలా తనను ఆదరించిన వారందరిగా మద్దతుగా నిలవాలనుకుంటున్నట్టు విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా ‘జయ నాయగన్’ మూవీ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.
యంగ్ సెన్సేషన్ అనిరుధ్ తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంగ్స్, బీజీఎం ఇస్తుంటారని.. అందుకే ఆయన్ను ‘మ్యూజికల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్’ అని పిలుస్తుంటానని విజయ్ తెలిపారు. గతంలో దర్శకుడు హెచ్.వినోద్‌తో కలిసి పని చేయాల్సి ఉన్నా కూడా వీలు పడలేదని.. ఆయనొక సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడని విజయ్ పేర్కొన్నారు. సినిమాలో మమితా బైజు పాత్ర అందరికీ గుర్తుండిపోవడంతె సాటే తమ కాంబోకు మంచి క్రేజ్ ఏర్పడుతుందన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే మంచి స్నేహితులే కాకుండా బలమైన శత్రువు సైతం ఉండాలన్నారు. శత్రువు ఎంత బలంగా ఉంటే అంత స్ట్రాంగ్ అవుతారని అన్నారు. మనం చేసేది చిన్న సాయమైనా భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని.. ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని అభిమానులకు సూచించారు. ‘జన నాయగన్’ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.