Chiru-Bobby Movie: అబ్బో అదేం టైటిల్.. తాతాజీలా..!
మొదట సినిమాకు ప్రమోషన్స్ ప్రారంభమయ్యేది టైటిల్‌తోనే.. అదెంత క్రేజీగా ఉంటే అంతలా దూసుకెళుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’తో మంచి సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు.
మొదట సినిమాకు ప్రమోషన్స్ ప్రారంభమయ్యేది టైటిల్‌తోనే.. అదెంత క్రేజీగా ఉంటే అంతలా దూసుకెళుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’తో మంచి సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాకు మొదట టైటిలే పెద్ద ఎసెట్‌గా మారింది. చిరు అసలు పేరుతో వచ్చిన చిత్రం కావడంతో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇక చిరు నెక్ట్స్ సినిమా ఏదనే విషయమై కొంత సందిగ్ధత అయితే నెలకొంది. వాస్తవానికి విశ్వంభర చిత్రం గతేడాది సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. అది కాస్తా వాయిదా పడింది. చిత్ర అప్‌డేట్స్ చూసిన అభిమానులు పెదవి విరవడమే అందుకు కారణం.
ఇక ‘విశ్వంభర’ ఇప్పటికైనా విడుదలవుతుందా? అంటే అనుమానమే. ఈ క్రమంలోనే చిరు సైతం ‘విశ్వంభర’ను పక్కనబెట్టేసి బాబీతో సినిమాను పట్టాలెక్కించనున్నారని టాక్. బాబీ, చిరు కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. దీంతో బాబీ చిత్రాన్ని లైన్‌లో పెట్టే యోచనలో ఉన్నారని సమాచారం. అయితే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఒకట్రెండు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటారా? ‘కాకా’ కానీ ‘కాకాజీ’ కానీ అనుకుంటున్నారట. కాకాజీ ఏంటి తాతాజీ మాదిరిగా అని కొందరు.. ఇంతకు మించి ఇంకేం టైటిల్స్ దొరకలేదా? అని మరికొందరు. మొత్తానికి ఫ్యాన్సే సినిమా టైటిల్‌పై పెదవి విరుస్తుంటే ఇతర ఆడియన్స్‌కి ఇంకే నచ్చుతుంది.
ఇదే టైటిల్ పెడితే మాత్రం ముందు నుంచే చిత్రం నెగిటివిటీని మూటగట్టుకునే అవకాశం ఉంది. ఇక డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుందట. చిరు కోసం బాబీ పవర్‌ఫుల్ స్టోరీనే రాసుకున్నారని టాక్. ఇంతకు ముందు ఇదే లైన్‌తో చిరు ‘డాడీ’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. మరి బాబీ ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఈ చిత్రంలో ప్రియమణి చిరుకు జోడిగా నటిస్తోంట. చిరు కూతురి పాత్రలో కృతి శెట్టి నటిస్తోందని టాక్. మొత్తానికి భారీ స్థాయిలో ఈ చిత్రానికి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్ర టీమ్‌లో దుబాయ్‌లో స్టోరీ సిట్టింగ్స్, స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తోందట. అన్నీ ఓకే అయితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కుతుందట. అయితే టైటిల్ విషయంలో జాగ్రత్త వహించకుంటే మాత్రం చిత్రం అటు నుంచి అటు అస్సామే అనే టాక్ వినిపిస్తోంది.