Entertainment

Biggboss: ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఇవాళ (బుధవారం) వచ్చిన ప్రోమో చూశారా? ప్రోమోను బట్టి అయితే డిసైడ్ చేయలేం కానీ.. ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్టైతే బిగ్‌బాస్ ప్రోమోలో చూపించారు.

Biggboss: ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 (Biggboss Telugu Season 9) ఇవాళ (బుధవారం) వచ్చిన ప్రోమో చూశారా? ప్రోమోను బట్టి అయితే డిసైడ్ చేయలేం కానీ.. ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ (Triangle Love Story) నడుస్తున్నట్టైతే బిగ్‌బాస్ ప్రోమో (Biggboss Promo)లో చూపించారు. పవన్ కల్యాణ్ - డిమాన్ పవన్ - రీతూ చౌదరి (Rithu Chowdary) మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీనైతే చూపించారు. ఫస్ట్ పవన్ కల్యాణ్ - రీతూ చౌదరి మధ్య ఏదో ఉన్నట్టుగా చూపించారు. ఆ తరువాత డిమాన్ పవన్ - రీతూ చౌదరి మధ్య అయితే ఏదో పెద్ద స్టోరీనే నడుస్తున్నట్టుగా చూపించారు. అసలేం జరుగుతోంది? నిజంగానే లవ్ స్టోరీ (Love Story) నడుస్తోందా? అంటే రీతూ చూపులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఆమె ఫస్ట్ పవన్ కల్యాణ్‌తో పులిహోర కలిపేసి ఆ తరువాత డిమాన్ పవన్‌కు గోరు ముద్దలు తినిపించడం ఓర కంటితో చూడటం వంటివి చేసింది.

దీనికి బిగ్‌బాస్ అయితే రాధిక సాంగ్ వేసేశారు. ఆమె చూస్తున్న విధానం చూస్తుంటే సీజన్ 8లో విష్ణు ప్రియ (Anchor Vishnu Priya) గుర్తుకు వస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూస్తుంటే అభిజిత్ (Abhijith)- మోనాల్ (Monal) - అఖిల్‌ (Akhil)లు గుర్తుకు వస్తున్నారు. మొత్తానికి ఒకే ఎపిసోడ్ అమ్మడు రెండు సీజన్లను గుర్తు చేసింది. ఇక డిమాన్ పవన్ అయితే ఆమె వెంట హచ్ కుక్కపిల్లలా తిరుగుతున్నాడు. ఖుషి సినిమా (Khushi Movie)లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భూమిక (Bhumika)తో తనంటే ఇష్టమని చెప్పించాలని ఎలాగైతే నానా తంటాలు పడ్డాడో.. ఇక్కడ రీతూ మనసులో ఏముందో కనుక్కునేందుకు ఇతను కూడా నానా తంటాలు పడుతున్నాడు. ఇది పవన్ కల్యాణ్‌తో పోలిక కాదు.. ఒక సినిమాలోని సన్నివేశంతో పోలిక మాత్రమే.. మరోవైపు తనకసలు లవ్ అంటే ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మొత్తానికి బిగ్‌బాస్‌ (Biggboss)లో అయితే ఏదో లవ్ స్టోరీ మాత్రం ప్రారంభం కాబోతోందనేది మాత్రం తెలుస్తోంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 17, 2025 2:32 PM