Biggboss 9: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా..
ఇక దివ్వెల మాదురికి అహంకారం ఓ రేంజ్‌లో ఉంది. తానే ఒక బిగ్‌బాస్ (Biggboss) మాదిరిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది.

బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)కి వైల్డ్ కార్డ్స్‌గా ఆరుగురు వచ్చారు. ఎవరికి ఎవరూ తీసిపోరు.. కొందరికి కండబలంతో పాటు నోటి బలం కూడా ఎక్కువే. ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా మాట్లాడేవారిలో ముందు వరుసలో దివ్వెల మాదురి (Divvela Madhuri), అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Alekhya Chitti Pickles Ramya) ఉన్నారు. ఇక దివ్వెల మాదురికి అహంకారం ఓ రేంజ్‌లో ఉంది. తానే ఒక బిగ్‌బాస్ (Biggboss) మాదిరిగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం ముందుగా అవకాశం వైల్డ్ కార్డ్స్‌కి ఇచ్చి ఇప్పటికే హౌస్‌లో ఉన్న వారిలో కొందరి ఎంచుకుని వారితో టాస్క్ ఆడమని బిగ్‌బాస్ చెప్పారు.
ఇక వైల్డ్ కార్డ్స్ అంతా కలిసి మాట్లాడుకుని హౌస్‌లో చాలా వీక్ కంటెస్టెంట్స్‌గా భావించి భరణి (Bharani), దివ్య నికిత (Divya Nikitha), తనూజ (Tanuja), సుమన్ శెట్టి (Suman Shetty)లను ఎంచుకున్నారు. నలుగురికి నలుగురు అంత స్ట్రాంగ్‌గా కండబలంతో ఉన్న వైల్డ్ కార్డ్స్‌ని గట్టిగానే హోల్డ్ చేశారు కానీ సాధ్య పడలేదు. తొలుత టాస్క్ నుంచి భరణిని తప్పించారు. ఆ తరువాత దివ్య నికితను తప్పించారు. ఇక మిగిలింది.. తనూజ, సుమన్ శెట్టి. వీరిద్దరూ చాలా వీక్ అని వీరిని ఉంచారు. వీరిద్దరిలో సుమన్ శెట్టి ఓ రేంజ్‌లో ఆడి వైల్డ్ కార్డ్స్‌కి చుక్కలు చూపించాడు. ఫైనల్ టాస్క్‌లో సుమన్ శెట్టి, గౌరవ్ ఇద్దరూ కెప్టెన్స్ అయినట్టుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా ఇద్దరు కెప్టెన్స్. ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలి.
ప్రజావాణి చీదిరాల