Entertainment

ఇలా మిస్ యూనివర్స్ ఇండియా అయ్యిందో లేదో..

ఈ ముద్దుగుమ్మ రవివర్మ కుంచె నుంచి జాలువారినది కాదు.. ఏకంగా విశ్వకర్మే ఒక రత్నంలా మలిచి భూమిపైకి పంపించినట్టున్నాడు. అందుకే ఈ అందాల బొమ్మకు..

ఇలా మిస్ యూనివర్స్ ఇండియా అయ్యిందో లేదో..

ఈ ముద్దుగుమ్మ రవివర్మ కుంచె నుంచి జాలువారినది కాదు.. ఏకంగా విశ్వకర్మే ఒక రత్నంలా మలిచి భూమిపైకి పంపించినట్టున్నాడు. అందుకే ఈ అందాల బొమ్మకు తల్లిదండ్రులు మణిక విశ్వకర్మ అని పేరు పెట్టారు. ఇక పేరులోనే ఉందిగా.. మరి ఎందుకు ప్రయత్నించకూడదు? అనుకుందో ఏమో విశ్వ విజేత కావాలని పయనం ప్రారంభించి కొంతమేర సక్సెస్ కూడా అయ్యింది. ఈ క్రమంలోనే.. జైపుర్‌ వేదికగా ఆగస్టు 18న జరిగిన ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025’ (Miss Universe India 2025) పోటీల్లో ఆమె విజయం సాధించింది. మణికకు గతేడాది అంటే 2024 మిస్‌ యూనివర్స్‌ ఇండియా రియా సింఘా.. కిరీటాన్ని అలంకరించింది. ప్రస్తుతం 74వ మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌లో నవంబర్‌లో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల్లో మణిక భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

ఇక తాజాగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ రన్నరప్‌గా నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో మోహక్ థింగ్రా, అమిషి కౌశిక్‌ నిలిచారు. ఇక మణిక ‘మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2025’ అని తెలియకగానే యూత్ అంతా అమ్మాయి పుట్టుపూర్వోత్తరాల గురించి వెదకడం మొదలు పెట్టింది. మణిక రాజస్థాన్‌లో పుట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆమె కుటుంబం నివసిస్తోంది. మణిక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన మణిక జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చింది. అలాగే న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి దాని ద్వారా న్యూరోలాజికల్‌ సమస్యలతో బాధపడే వారికి సేవలు అందిస్తోంది. ఇక మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం దక్కించుకోవడంపై మణిక మాట్లాడుతూ.. తన స్వస్థలం గంగానగర్ నుంచి ఢిల్లీకి వచ్చి పోటీకి సిద్ధమైనట్టు తెలిపింది. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపింది. తన విజయం వెనుక ఎందరో ఉన్నారని.. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన వారందరికీ మణిక ధన్యవాదాలు తెలిపింది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 19, 2025 8:50 AM