Entertainment

The Pre Wedding Show: ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు.. అన్నీ ప్రశంసలే..

గత ఐదేళ్లుగా తాను మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నానని.. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. తనిచ్చిన పాటలైతే బాగున్నాయి కానీ సినిమాలే ఆడటం లేదని అంటుండేవారు..

The Pre Wedding Show: ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు.. అన్నీ ప్రశంసలే..

హీరో తిరువీర్ (Hero Tiruveer), టీనా శ్రావ్య (Teena Sravya) జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ (The Pre Wedding Show). 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం (Sandeep Agaram), అష్మిత రెడ్డి (Ashmitha Reddy) సంయుక్తంగా నిర్మించారు. రాహుల్ శ్రీనివాస్ (Director Rahul Srinivas) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆర్గానిక్ కామెడీతో మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు, రచయిత, నటుడు బీవీఎస్ రవి (BVS Ravi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ను మీడియా చిత్రంగా అభివర్ణించారు. చిన్న చిత్రాలు బతకాలని అంతా అంటుంటారని.. మంచి చిత్రానికి మాత్రం అంతా ముందుండి నడిపిస్తారన్నారు. పెద్ద బ్యానర్స్ అయితే సులభంగానే చిన్న చిత్రాల్ని విడుదల చేస్తాయి కానీ కొత్త, చిన్న నిర్మాతలు తీసే చిన్న సినిమాల్ని రిలీజ్ చేయడమే చాలా కష్టమని అన్నారు. ఇలా మంచి అభిరుచి ఉన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయని బీవీఎస్ రవి పేర్కొన్నారు. తిరువీర్, టీనా శ్రావ్య, రోహన్ అందరూ అద్బుతంగా చేశారని.. తనకు ‘బలగం’ తర్వాత మంచి ఫీల్ ఇచ్చిన సినిమా ఇదేనన్నారు. ఈ చిత్రాన్ని ఏదో సినిమా హాల్‌కు వెళ్లినట్టుగా కాకుండా ఏదో ఊరెళ్లి చూసినట్టుగా ఉందన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ .. ‘సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారని.. అలాగే ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పానన్నారు. సినిమా పనులన్నీ ఒక చిన్న గదిలోనే పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ సినిమాను రోహన్ తన ఇన్‌స్టాలో బాగా ప్రమోట్ చేశాడని తెలిపారు. ఎక్కడా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా కనిపించలేదన్నారు. తన సినిమాలన్నీ మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీతోనే ఆడుతుంటాయని.. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్ అవుతోందని తెలిపారు. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ .. తమ చిత్రాన్ని ఒక్క నెగెటివ్ రివ్యూ, కామెంట్ లేకుండా అందరూ ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. తిరువీర్, సందీప్ కోసం ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకున్నానని... ఒంటెద్దు బండిలా తిరువీర్ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకు వచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి కథలు థియేటర్లో ఆడవేమోనని అనుకున్నానని కానీ ప్రేక్షకులు తమ చిత్రాన్ని మంచి సక్సెస్ చేశారన్నారు. ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే సహజత్వంతో కూడిన ఎన్నో కథలను చాలా మంది దర్శకులు మీ ముందుకు తీసుకువస్తారన్నారు.

నిర్మాత సందీప్ అగరం మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లు చూసి మీడియా వాళ్లు గంట సేపు మాట్లాడారని.. వారి వల్లే మా మూవీ ఆడియెన్స్ వరకూ చేరిందన్నారు. టీఎఫ్‌జేఏకి తన వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. తనను నిర్మాతగా ఈ మూవీ మార్చిందని.. ఇదంతా రాహుల్ కారణంగానే సాధ్యమైందన్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులంతా ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారన్నారు. హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’కి సపోర్ట్ చేస్తున్న మీడియాకి.. ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన డైరెక్షన్ టీంకు థాంక్స్ చెప్పారు. సినిమాలోని ప్రతీ సీన్‌ను ఆడియెన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారని.. తమ మూవీని చూడని వాళ్లంతా చూడాలని పేర్కొన్నారు. నటి యామిని మాట్లాడుతూ .. తనను ఆడిషన్స్ చేసినప్పుడు సెలెక్ట్ అవుతానా? లేదా? అని టెన్షన్ పడ్డానని పేర్కొంది. సినిమా చాలా బాగా వచ్చిందని.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోందని తెలిపింది.

నటుడు నరేంద్ర రవి మాట్లాడుతూ .. ‘‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చిందని తెలిపారు. తనకు శ్రీకాకుళం యస తెలియదని.. రాహులే దగ్గరుండి తనకు నేర్పించారన్నారు. సినిమాపై ఒక్క నెగిటివ్ టాక్ కూడా వినిపించలేదన్నారు. తిరువీర్ఈ మూవీని భుజానికి ఎత్తుకుని ముందుకు నడిపించారని.. రాహుల్ తనను యాక్టర్‌గా నిలబెట్టారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. గత ఐదేళ్లుగా తాను మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నానని.. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. తనిచ్చిన పాటలైతే బాగున్నాయి కానీ సినిమాలే ఆడటం లేదని అంటుండేవారని.. ఈ సినిమాతో తనకు మంచి సక్సెస్‌తో పాటు గుర్తింపు కూడా వచ్చిందన్నారు. ఈ సక్సెస్ కోసమే నేను ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చానన్నారు. మాస్టర్ రోహన్ మాట్లాడుతూ .. ‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కోసం ట్వీట్ వేసిన విజయ్ దేవరకొండకు థ్యాంక్స్ తెలిపాడు. తాము పడిన కష్టానికి ఈ మూవీ మంచి ప్రతిఫలాన్నిచ్చిందన్నాడు. ఈ సినిమాను అంతా ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 9, 2025 8:29 AM