Entertainment

దేశమంతా అష్నూర్ గురించే సెర్చ్.. అసలు ఎవరీమె?

అష్నూర్ కౌర్.. దేశమంతా ఈమె గురించి గాలిస్తోంది. అసలు ఎవరీమె? నెటిజన్లు అంతా పనిగట్టుకుని మరీ ఎందుకు అంతలా ఈమె కోసం సెర్చ్ చేస్తున్నారు?

దేశమంతా అష్నూర్ గురించే సెర్చ్.. అసలు ఎవరీమె?

అష్నూర్ కౌర్ (Ashnoor kaur).. దేశమంతా ఈమె గురించి గాలిస్తోంది. అసలు ఎవరీమె? నెటిజన్లు (Netizen) అంతా పనిగట్టుకుని మరీ ఎందుకు అంతలా ఈమె కోసం సెర్చ్ చేస్తున్నారు? తెలుసుకుందాం. త్వరలోనే హిందీ బిగ్‌బాస్ 19 (Biggboss 19) సల్మాన్ ఖాన్ (Salman Khan) సారథ్యంలో ప్రారంభం కాబోతోంది. ఈ షో కంటెస్టెంటే అష్నూర్ కౌర్. ఇప్పటికే అష్నూర్ హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయినా ఆమె కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘ఝాన్సీ కి రాణి (Jhansi Ki Rani), సాథ్ నిభానా సాథియా (Saath Nibhana Saathiya), యే రిష్టా క్యా కెహ్లతా హై (Yeh Rishta Kya Kehlata Hai), పాటియాలా బేబ్స్ ఔక: సుమన్ ఇండోరి Patiala Babes Auka: Suman Indori)’ వంటి అనేక ప్రముఖ షోల ద్వారా అష్ను సుపరిచితురాలే. బిగ్ బాస్ 19 హౌస్‌లోకి ప్రవేశించే అతి పిన్న వయస్కురాలు అష్నూర్.

అందుకే రిజెక్ట్ చేశా..

తాజాగా ఆమె మాట్లాడుతూ.. తనను గత సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్, తన సహనటి అయిన హీనాఖాన్ (Heena Khan) తను బిగ్‌బాస్‌కు వెళ్లేందుకు ఎలాంటి సహాయ సహకారాలు అందించిందో వెల్లడించింది. వాస్తవానికి తనను బిగ్ బాస్ కోసం తనను ఇంతకు ముందే సంప్రదించారని, కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చింది. రియాలిటీ షోలలో పాల్గొనడంపై అష్నూర్ మాట్లాడుతూ.. తను ఈ షోలో పాల్గొనాలంటూ తనకు కొన్నేళ్లుగా కాల్ వస్తోందని తెలిపింది. ఆ సమయంలో తను చాలా చిన్నదాన్ని అవడం మూలానో.. లేదంటే కాలేజీలో చదవడమో.. అదీకాదంటే మరేదైన షో చేయడం వంటి కారణంగానో రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపింది.

దేనికీ నో చెప్పను..

ఈ ఏడాది మాత్రం ప్రయత్నించి చూద్దామనుకుందట. దీనికి కారణం ఇది తను ఇష్టపడే షో మాత్రమే కాకుండా.. తనను ఇష్టపడే ప్రేక్షకులు సైతం తనేంటనేది చూస్తారని అష్నూర్ పేర్కొంది. నాలుగున్నరేళ్ల నుంచి అంటే తన చిన్న వయసు నుంచి పని చేస్తూనే ఉన్నానని.. ఈ సమయంలో తాను ఎన్నో పాత్రలను పోషించానని.. కానీ ఇప్పుడు నిజమైన అష్నూర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలిపింది. తన వ్యక్తిత్వాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న వారి గురించి అష్నూర్ ఇంటర్వ్యూలో స్పందించింది. ‘‘తను చాలా సైలెంట్‌గా ఉంటానని.. దేనికీ నో చెప్పననే భావన చాలా మందిలో ఉంది. అది ఏమాత్రం వాస్తవం కాదు. నాకంటూ ప్రతి విషయంలోనూ ఓ అభిప్రాయం ఉంటుంది. నాకు ఏదైనా తప్పు అనిపిస్తే తప్పక నా వాయిస్ వినిపిస్తాను. నాతో ఎవరైనా మంచిగా ఉంటే.. నేను కూడా వారితో మంచిగా ఉంటాను. గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం నిన్నా దేవుడే నా నుంచి కాపాడాలి’’ అంటూ ఆసక్తిగా చెప్పుకొచ్చింది.

పెద్దవారైనా వదిలిపెట్టను..

ప్రస్తుత బిగ్‌బాస్ షోలో అతి పిన్న వయస్కురాలిగా ఉండటం అనేది నాకు ప్లస్ అవుతుందో లేదంటే మైనస్ అవుతుందో తెలియదు. అష్నూర్ తన వయసు గురించి మాట్లాడుతూ.. ‘‘నా వయసును చూపించి నన్ను ఎలిమినేట్ చేయవచ్చు. కానీ అదే సమయంలో అది నాకు ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే పెద్దవారి పట్ల గౌరవంగా ఉంటాను.. అదే సమయంలో వారు చేస్తున్నది తప్పు అనిపిస్తే మాత్రం పెద్దవారైనా వదిలిపెట్టను.. నేను గట్టిగానే మాట్లాడతాను’’ అంటూ తన గురించి తాను గట్టిగానే చెబుతోంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి ఏం చేస్తుందో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 25, 2025 9:35 AM