Entertainment

Biggboss Agnipariksha Rivew: రౌండ్ 2.. ఫౌల్ గేమ్స్.. అన్‌ఫెయిర్..

‘ఐ యామ్ ఏ లూజర్..’ అని టాట్యూ వేసుకోవడం.. ఇక డేర్ ఏంటంటే.. ఒకరికి కాల్ చేసి డబ్బు వేయించుకోవాలి. వారిలో కల్కి గెలిచింది. అయితే ఇది అన్‌ఫెయిర్ అన్నట్టుగా..

Biggboss Agnipariksha Rivew: రౌండ్ 2.. ఫౌల్ గేమ్స్.. అన్‌ఫెయిర్..

బిగ్‌బాస్ తెలుగు (Biggboss Telugu) 9వ సీజన్‌కు సిద్ధమవుతోంది. దీనికి ముందు సామాన్యులను సెలక్ట్ చేయడం కోసం అగ్ని పరీక్ష (Agnipariksha) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెగా ఆడిషన్స్ పూర్తయ్యాయి. మెగా ఆడిషన్స్‌లో ఆరుగురుని సెలక్ట్ చేశారు. మరో 9 మంది కోసం అగ్నిపరీక్ష మరో రౌండ్ ప్రారంభమైంది. అసలైన అగ్నిపరీక్ష ఇప్పుడే ప్రారంభమైందని జ్యూరీ నవదీప్ (Navadeep), బిందు మాధవి (Bindu Madhavi), అభిజిత్ (Abhijith) చెప్పారు. ఇక సెకండ్ రౌండ్‌లో యాంకర్ శ్రీముఖి (Anchor Srimukhi)తో పాటు జ్యూరీ మెంబర్స్ ముగ్గురూ కలిసి కొన్ని డేర్స్ ఇస్తారు. వాటిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలి. అది పూర్తి చేసిన వారికి గోల్డెన్ చైర్ దక్కుతుంది. ఫస్ట్ డేర్ వచ్చేసి హరిత హరీష్, సాయికృష్ణల మధ్య జరిగింది. ఇక ఫస్ట్ డేర్ ఏంటంటే.. రేజర్‌తో హాఫ్ పార్ట్ షేవ్ చేసుకోవాలి. దీనికి ఇద్దరూ షేవ్ చేసుకుంటామని చెప్పారు. అయితే అన్ని షోస్ పూర్తయ్యేవరకూ అలాగే ఉండాలని చెప్పాడు. దీనికి ఇద్దరూ ఓకే చెప్పారు. హరీష్ రేజర్ అందుకుని తలపై సగం చుట్టూ రిమూవ్ చేసుకుని గోల్డెన్ చైర్‌ను దక్కించుకున్నాడు.

నెక్ట్స్ డేర్ వచ్చేసి అమ్మాయిలకు ఇస్తానని శ్రీముఖి చెప్పింది. ఆ డేర్‌ను ఊర్మిళ, శ్రీజ దమ్ముకు ఇచ్చింది. ఇక డేర్ ఏంటంటే.. ‘ఐ యామ్ ఏ లూజర్..’ అని టాట్యూ వేసుకోవడం.. తాను లూజర్ కాదని.. కాబట్టి తాను టాట్యూ వేసుకోనని ఊర్మిళ చెప్పింది. శ్రీజ మాత్రం తాను వేసుకుంటానని చెప్పింది. తొలుత ఫేస్‌పై వేసుకోవాలని శ్రీముఖి చెప్పింది. అయినా శ్రీజ ఓకే చెప్పింది. కానీ దానిని సవరించి చేతిపై అని చెప్పింది. ‘ఐ యామ్ ఏ లూజర్..’ అని కాకుండా ఐ లవ్ బిగ్‌బాస్ అని టాట్యూ వేయించారు. శ్రీజకు గోల్డెన్ చైర్ దక్కింది. ఆ తరువాత డేర్ అభిజిత్ ఇచ్చాడు. ముందుగా దీనికి పవన్‌ని పిలిచారు. తన కాంపిటేటర్‌ని తనే ఎంచుకోమన్నారు. అతను అబుని సెలక్ట్ చేసుకున్నాడు. ఇక ముందుగా ఇద్దరి వెయిట్ చెక్ చేశారు. వారి ముందు ఫుడ్ పెట్టి ఎవరు 10 నిమిషాల్లో ఒక కేజీ వెయిట్ పెరుగుతారో వారికే గోల్డెన్ చైర్ అని అభి చెప్పాడు. పది నిమిషాల తర్వాత చెక్ చేస్తే కిలో పైనే పవన్ పెరిగాడు. అబు 700 గ్రా. పెరిగాడు. దీంతో పవన్ గోల్డెన్ సీట్‌కి వెళ్లిపోయాడు.

నెక్ట్స్ బిందు వంతు.. ఆమె అలేఖ్య మాస్ అని చెప్పింది కాబట్టి తాను ఆమెకు క్లాస్ డేర్ ఇస్తున్నట్టుగా చెప్పింది. అమ్మాయిల్లో ఎవరు ఇద్దరు వస్తారో వారినే డిసైడ్ చేసుకోమంటే.. డాలియా, ప్రియ వచ్చారు. ఒకరి బెలూన్‌ని మరొకరు పగలగొట్టడం డేర్. కేవలం రైట్ హ్యాండ్‌తోనే పగులగొట్టాలి. ప్రియ హైట్ ఉంది కాబట్టి సునాయాసంగానే బెలూన్ పగులగొట్టేసింది. పైగా ఆమె ఫౌల్ గేమ్ ఆడింది. ప్రియ తన రెండో చేతిని కూడా ఉపయోగించింది. కనీసం ఈ విషయాన్ని బిగ్‌బాస్ గమనించకపోవడం ఆసక్తికరం. నెక్ట్స్ డేర్ శ్రీముఖి ఇచ్చింది. ఇది షాకీబ్, కల్కికి మధ్య జరిగింది. ఇక డేర్ ఏంటంటే.. ఒకరికి కాల్ చేసి డబ్బు వేయించుకోవాలి. వారిలో కల్కి గెలిచింది. అయితే ఇది అన్‌ఫెయిర్ అన్నట్టుగా షాకీబ్ ఫీలయ్యాడు. దీనికి కారణం షాకీబ్‌ని బయటకు పంపించి కల్కికి క్లియర్‌గా చెప్పారు కానీ అతనికి క్లియర్‌గా చెప్పలేదు. ఆ తరువాత జ్యూరీ కూడా ఇది ఎవరికైనా అన్‌ఫెయిర్ అనిపించిందా? అంటే శ్రీజ దమ్ము చేయెత్తింది. అయితే ఇక్కడ నవదీప్ ఆమెకు వార్నింగ్ ఇచ్చిన తీరుపై విమర్శలొస్తున్నాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 25, 2025 6:56 AM