Entertainment

Akhanda 2: రిలీజ్‌కు కొన్ని గంటల ముందు ‘అఖండ 2’ వాయిదాకు కారణమేంటంటే..

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడింది.

Akhanda 2: రిలీజ్‌కు కొన్ని గంటల ముందు ‘అఖండ 2’ వాయిదాకు కారణమేంటంటే..

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారమైతే బాలయ్య అఖండ తాండవం నేడు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలకు కొన్ని గంటల ముందు వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాక్ ఇచ్చింది. వాస్తవానికి ఈ సినిమా విడుదలపై ఊహాగానాలు వినవస్తున్నా కూడా టికెట్ల పెంపుదల, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో ఇక విడుదల పక్కా అని అంతా భావించారు.

‘అఖండ 2’ షెడ్యూల్‌ ప్రకారం విడుదల కావడం లేదని.. 14 రీల్స్ ప్లస్ తెలిపింది. ఈ విషయం పట్ల చింతిస్తున్నామని, తమకు కూడా ఈ క్షణం బాధాకరంగానే ఉందని.. సినిమా వాయిదా అనేది ప్రతి అభిమానిలోనూ నిరాశను కలిగిస్తుందనే విషయాన్ని తాము అర్థం చేసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకొస్తామని.. ఈ సమయంలో అందరి మద్దతు తమకు కావాలని కోరింది. అసలు సినిమాను ఉన్న ఫళంగా ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న విషయాన్ని సైతం ప్రకటించలేదు.

‘సంక్రాంతి’ సమయంలో విడుదల చేస్తే బాగుంటుందనే.. బిజినెస్ మరింత బాగా అవుతుందనే కారణంగానే చిత్రాన్ని వాయిదా వేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇవాళ (శుక్రవారం) చిత్ర విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలయ్య మళ్లీ డ్యుయల్ రోల్ పోషించిన ‘అఖండ తాండవం’పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే అఘోర పాత్రలో బాలయ్య కనిపించనుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా మెప్పించనున్నారు. సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పూర్ణ, హర్షాలి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 5, 2025 3:14 AM