Entertainment

The Rajasaab: ఇలా విడుదలయ్యిందో లేదో.. అలా కంపారిజన్ స్టార్ట్..

ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ సినిమా చూసిన వారు ఊరికే ఉండరు కదా.. ఏదో ఒక మెలిక అయితే పెట్టేస్తారు.

The Rajasaab: ఇలా విడుదలయ్యిందో లేదో.. అలా కంపారిజన్ స్టార్ట్..

ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ సినిమా చూసిన వారు ఊరికే ఉండరు కదా.. ఏదో ఒక మెలిక అయితే పెట్టేస్తారు. ఈ సినిమా చూసిన వారు.. ఈ సినిమాను మరో బాలీవుడ్ సినిమాతో పోల్చి రచ్చ చేస్తున్నారు. అది మరేదో కాదు.. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన హారర్‌ కామెడీ చిత్రం ‘భూల్‌ భులయ్యా’. ‘ది రాజాసాబ్’ చిత్రం ఈ చిత్రాన్ని పోలి ఉందంటూ రచ్చ లేపుతున్నారు. దీనిపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఇది పూర్తి భిన్నమైన కథ అని ప్రభాస్‌ కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించామని తెలిపారు.

భారత్‌లోనే అతిపెద్ద స్టార్‌ అయిన ప్రభాస్ (Prabhas)ను దృష్టిలోపెట్టుకొని ఆయన కోసం తాము కథను సిద్ధం చేసినట్టుగా తెలిపారు. ఇప్పటి వరకూ ఇలాంటి కథ రాలేదని.. విజువల్స్‌ కూడా కొత్తగా ఉంటాయని నిర్మాత చెప్పారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రిద్ది కుమార్ ఈ ప్రచారంపై మాట్లాడుతూ.. ‘భూల్‌ భులయ్యా’ ఒక అద్భుతమైన సినిమా అని తనకు చాలా ఇష్టమని తెలిపింది. అయితే ‘ది రాజాసాబ్’ మాత్రం దానిలా ఉండదని.. ఫాంటసీ అంటేనే లేని దాన్ని సృష్టించడమని పేర్కొంది. ఈ చిత్రంలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని.. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందని తెలిపింది.

‘రాజాసాబ్‌’ కూడా ‘భూల్‌ భులయ్యా’ అంత హిట్‌ కావాలని నిధి అగర్వాల్‌ సైతం తెలిపింది. ఇకపోతే ‘ది రాజాసాబ్’కు సీక్వెల్ కూడా ఉందండోయ్. ఈ విషయాన్ని సినిమాలోనే అధికారికంగా ప్రకటించేశారు. అంతేకాకుండా ఈ సీక్వెల్‌కు లీడ్ కూడా మేకర్స్ ఇచ్చేశారు. అయితే సినిమా పార్ట్ 2 ‘రాజాసాబ్ సర్కస్: 1935’ అనే టైటిల్‌తో రూపొందనుంది. ఇక సినిమా విషయానికి వస్తే మనకు ట్రైలర్‌లో చాలా విషయాలను చూపించారు. వాటిలో కొన్ని సన్నివేశాలు సినిమాలో కనిపించలేదు. దీంతో రెండో భాగంలో వాటిని చూపించనున్నారని టాక్ మొదలైంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 9, 2026 9:26 AM