The Rajasaab: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది రాజాసాబ్’.. హాట్ టాపిక్‌గా రన్ టైమ్
ది రాజాసాబ్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (Censor Board) యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమా ప్రిరిలీజ్ వేడుకకు సైతం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతి (Director Maruthi) కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘ది రాజాసాబ్’ (The Rajasaab). మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్ (Riddi Kumar) ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్ (Sanjay Dutt) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. హారర్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా సంక్రాంతి (Sankranthi) కానుకగా 2026 జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిమానుల కోసం జనవరి 8న దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్లు ఉంటాయని మేకర్స్ ప్రకటించారు. ఇక సెన్సార్ రిపోర్టును పరిశీలిస్తే ఈ చిత్రం నిడివి 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు).
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (Censor Board) యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమా ప్రిరిలీజ్ వేడుకకు సైతం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక ఓపెన్ గ్రౌండ్‌లో ప్రి రిలీజ్ (The Rajasaab Pre Release Event) ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ భావిస్తున్నారు. చాలా కాలం తర్వాత అభిమానులు ప్రభాస్‌ను చూడనున్నారని తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (TG Viswa Prasad) సైతం ఈ విషయాన్ని చెప్పడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు డేట్ అయితే ఇప్పటి వరకూ ఫిక్స్ కాలేదు. ఇక ఈ మూవీ నుంచి ఇటీవలే ‘సహనా సహనా’ పాట విడుదలైంది. ప్రభాస్-నిధి అగర్వాల్‌తో తెరకెక్కించిన ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇతర అప్‌డేట్స్‌కు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.
ప్రజావాణి చీదిరాల