Sangeeth Sobhan: ‘మ్యాడ్’ హీరో మళ్లీ మొదలెట్టాడు..
మ్యాడ్ (Mad), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan)..
మ్యాడ్ (Mad), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan) మరో సినిమా మొదలుపెట్టాడు. ఇటీవల ‘గర్ల్‌ఫ్రెండ్’ (Girlfriend) తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni), న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని (Giribabu Vallabhaneni) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ (Palnati Surya Prathap) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇవాళ (నవంబర్ 15) ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran), నిర్మాత ఎస్‌కేఎన్ (Producer SKN) తదితరులు హాజరయ్యారు. రాహుల్ రవీంద్రన్ స్క్రిప్ట్ అందజేయగా.. ఎస్‌కేఎన్ ఫస్ట్ క్లాప్ ఇచ్చి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సినిమా ఓ సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీ (Trendy Love Story)గా రూపొందనుంది. ప్రొడక్షన్ నంబర్ 3 (Production No 3)గా చిత్రం నిర్మాణం కానుంది. ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందనుంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. అలాగే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
ప్రజావాణి చీదిరాల