Raviteja: అది వర్కవుట్ కాలే కానీ ఇద్దరు అమ్మాయిలతో డ్రీమ్ నెరవేరింది..
సీరియస్ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు కామెడీ రోల్స్ చేస్తూ ఉండాలని నటుడు సునీల్ (Sunil)కు హీరో రవితేజ (Ravi Teja) సూచించారు. సునీల్ ఒకప్పుడు కమెడియన్ పాత్రలు చేస్తూ బ్రహ్మానందం తరువాత ఆయనే అన్నట్టుగా ఎదిగాడు.
సీరియస్ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు కామెడీ రోల్స్ చేస్తూ ఉండాలని నటుడు సునీల్ (Sunil)కు హీరో రవితేజ (Ravi Teja) సూచించారు. సునీల్ ఒకప్పుడు కమెడియన్ పాత్రలు చేస్తూ బ్రహ్మానందం తరువాత ఆయనే అన్నట్టుగా ఎదిగాడు. ఆ తరువాత హీరో పాత్రలకే పరిమితమై కెరీర్‌నే ఇబ్బందుల్లో పెట్టుకున్నాడు. తిరిగి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో కమెడియన్ అయ్యాడు. ఈ చిత్రం నేడు సక్సెస్ మీట్ నిర్వహించుకుంది. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. తన తల్లి, సునీల్ మాతృమూర్తి ఇద్దరూ మంచి స్నేహితులని తెలిపారు. వారి వెటకారమే తమకు కూడా వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా సునీల్‌తో తనకున్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకున్నారు. ‘భద్ర’ సినిమా నుంచి సునీల్‌తో కలిసి ప్రయాణం సాగిస్తున్నట్టు తెలిపారు. దర్శకుడు కిశోర్ తిరుమలతో ఇంతకుముందే ఓ సినిమా చేయాలనుకున్నట్టు రవితేజ తెలిపారు. అప్పుడు సాధ్యం కాలేదని.. ఇప్పుడు సాధ్యమైందన్నారు. బాలు మహేంద్ర, జంధ్యాల వంటి వారి స్థాయిలో కిశోర్ రాస్తాడన్నారు. అందుకే ఆయన రైటింగ్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్‌ను కలగలిపి చక్కగా డీల్ చేస్తారన్నారు. ఆర్గానిక్ కామెడితో కూడిన ఇలాంటి సినిమాని రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయాల్సింది కానీ.. అది వర్కౌట్ కాలేదని.. కానీ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా నటించాలన్న డ్రీమ్ మాత్రం ఈ సినిమాతో నెరవేరిందని రవితేజ తెలిపారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విజయంలో క్రెడిట్‌ను మాత్రం కిశోర్‌తో పాటు సంగీత దర్శకుడు భీమ్స్‌కు ఇస్తానని పేర్కొన్నారు.