Entertainment

Adivi Sesh: ఆ విజువల్ ఇమాజినేషన్ నుంచి వచ్చిందే డెకాయిట్..

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఈ సారి జానర్‌ను మార్చేశాడు. యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్-ఇండియా మూవీ 'డెకాయిట్‌'తో ఈ నెల 10న ప్రేక్షకులను పలకరించనున్నాడు.

Adivi Sesh: ఆ విజువల్ ఇమాజినేషన్ నుంచి వచ్చిందే డెకాయిట్..

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఈ సారి జానర్‌ను మార్చేశాడు. యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్-ఇండియా మూవీ 'డెకాయిట్‌'తో ఈ నెల 10న ప్రేక్షకులను పలకరించనున్నాడు. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను భారీగా పెంచేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడవి శేష్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.

అలా అడగటంతో..

డెకాయిట్ హిందీ ట్రైలర్‌పై కూడా మంచి స్పందని వచ్చిందని.. తాము ఊహించిన దానికంటే రీచ్ అద్భుతంగా ఉందని అడవి శేష్ తెలిపారు. ఫస్ట్ టైం భోజ్‌పురిలో కూడా ప్రీమియర్ చేస్తారా? అని అడగటంతో చాలా ఆనందంగా అనిపించిందన్నారు. తన గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్‌ఫామ్ చేరుకోవడానికి లవ్ స్టోరీ కథలో చిన్న భాగంగా ఉండేదని.. కానీ ఈ సినిమాలో లవ్ స్టోరీనే మెయిన్ ప్లాట్‌ఫామ్ అన్నారు. లవ్ స్టోరీలో యాక్షన్ చూసేందుకు ప్రేక్షకులు వెళతారన్నారు. యాక్షన్‌ను చూసి లవ్‌ను మాత్రం ఇంటికి తీసుకెళతారన్నారు. ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ తన మైండ్‌లోకి రావడంతో ఒక బిజీ రోడ్డుపై ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి చిన్న పువ్వు బయటకు వస్తే ఎలా ఉంటుందన్న విజువల్ ఇమాజినేషన్ నుంచి కథ మొదలైందని అడవి శేష్ అన్నారు. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్ స్టోరీని తయారు చేసినట్టు తెలిపారు.

అమ్మ అడిగింది..

ఇక ఈ సినిమాలో తొలిసారిగా డ్యాన్స్ చేయడంపై అడవి శేష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఫంక్షన్‌లో డాన్స్ చేస్తున్నప్పుడు.. చాలా పొడుగ్గా ఉన్నానని.. డాన్స్ చేయొద్దని ఎవరో అనడంతో ఆగిపోయానన్నారు. కానీ ఈ సినిమా కోసం తనకు తాను పెట్టుకున్న లిమిటేషన్‌ను దాటేశానన్నారు. ఈ చిత్రంలో తాను హరి క్యారెక్టర్ పోషించానని.. దాని నుంచి చాలా ఇన్‌స్పైర్ అయినట్టు తెలిపారు. తను మొహం మీద మాట్లాడే వ్యక్తని.. చాలా ఓపెన్‌గా ఉండే క్యారెక్టర్ అని.. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టినట్టు శేష్ తెలిపారు. తన యాస చూసి తన తల్లి ఏంటలా మాట్లాడుతున్నావని అన్నారని నవ్వుతూ తెలిపారు. తన సినిమాలు డిలే అవుతున్నాయన్న విషయమై మాట్లాడుతూ.. తాను సినిమా చేసే ప్రాసెస్ అలా ఉంటుందని అన్నారు. గత రెండేళ్లుగా ఒక రోజు కూడా ఆగకుండా పని చేస్తున్నాననే తనకు ఉందని తెలిపారు.

ట్రూలీ జెమ్ ప్రొడ్యూసర్..

వరుసగా సినిమాలు రావాలంటే తాను రైటింగ్ ప్రాసెస్‌లో ఉండకూడదన్నారు. ‘గూడచారి 2’ తర్వాత ఎమోషనల్‌గా రీఛార్జ్ అవ్వాలి అనుకుంటున్నట్టు తెలిపారు. తమకు మొదటి నుంచి సినిమాని డాల్బీలో రిలీజ్ చేయాలని ఉందని.. కాకపోతే అల్లు అరవింద్ ఫోన్ చేసి సినిమా చాలా ప్రామిసింగ్‌గా ఉంది కొలబరేట్ అవుదామని చెప్పారన్నారు. అది తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇక ఈ సినిమాలో కన్నెపిట్టరో సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఓ సందర్భంలో తాను ఎప్పుడు ఫస్ట్ డ్యాన్స్ చేశానని సుప్రియ అడగ్గా.. వైజాగ్‌లో చిన్నప్పుడు కన్నె పెట్టారో, చీజ్ బడిహె పాటలకి డాన్స్ చేశానని చెప్పానన్నారు. అయితే ఇవే పాటలు పెడదామని సుప్రియ చెప్పడంతో హిందీలో చీజ్ బడి హే, తెలుగులో కన్నెపెట్టరో సాంగ్ పెట్టారన్నారు. అవి మంచి ప్లేస్ మెంట్స్‌లో వస్తాయన్నారు. సినిమాకి కర్త, కర్మ, క్రియ అన్నీ సుప్రియేనని శేష్ తెలిపారు. సుప్రియ ట్రూలీ జమ్ ప్రొడ్యూసర్ అని కొనియాడారు.

కాంపిటీషన్ స్పిరిట్..

ఈ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ పెట్టడంపై అడివి శేష్ మాట్లాడుతూ.. సీన్ చేస్తున్నప్పుడు ఫ్లోలో వచ్చిందని.. సిట్యువేషన్‌కి యాప్ట్‌గా ఉంటుందని కంటిన్యూ చేసినట్టు తెలిపారు. మృణాల్ అద్భుతమైన నటి అని.. తను సీన్‌లో ఉన్న ఎమోషన్‌ని బయట కూడా ఫీల్ అవుతుందని తెలిపారు. తనతో ఒక సీన్ చేసిన తర్వాత పర్ఫామెన్స్ చూసి తాను చాలా సర్ప్రైజ్ అయ్యానని.. మనం కూడా గేమ్ రైజ్ చేయాలని ఒక కాంపిటీషన్ స్పిరిట్‌తో చేసినట్టు శేష్ చెప్పారు. తనకు బ్రోకెన్ లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టమని.. అందుకే దేవదాస్ సినిమాని మనం ఎన్ని సార్లు అయినా చూస్తామన్నారు. తాను రాసిన ప్రతి సినిమాలో తన లైఫ్‌లో జరిగింది ఎంతో కొంత ఉంటుందని శేష్ తెలిపారు.

19 ఏళ్లప్పుడు బ్రేకప్..

తనకు ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు ఏం అర్థం కాలేదని.. అప్పుడు తనకు 19 ఏళ్ళని.. దాన్నుంచి బయటపడడానికి దాదాపు పదేళ్లు పట్టిందన్నారు. ఆ బ్రేకప్ జరిగినప్పుడు అర్థం కాని ఒక రెండేళ్లు ఉందని... ఆ ఎమోషన్ ని హరి క్యారెక్టర్ ద్వారా ఛానల్ చేయడానికి ట్రై చేసినట్టుగా శేష్ తెలిపారు. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకూ ఒకేలా కనిపించడానికి కారణం.. తాను స్మోక్, డ్రింక్ చేయనని.. నాన్ వెజ్ కూడా తిననని.. యూఎస్‌లో పెరగడం వల్ల మాసాలాలు, కారం కూడా చాలా తక్కువ తింటానని శేష్ తెలిపారు. ఈ ఏడాది చివరిలో ‘గూఢచారి 2’ వస్తుందని అడివి శేష్ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 6, 2026 5:11 PM