Movie News: ‘కోర్టు’ జంట ‘బ్యాండ్‌మేళం’ వాయిస్తుందట..
హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంట కోర్టు మూవీ (Court Movie)తో ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ చిత్రంలోని నటీనటులకు మంచి పేరొచ్చింది.

హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంట కోర్టు మూవీ (Court Movie)తో ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ చిత్రంలోని నటీనటులకు మంచి పేరొచ్చింది. వాస్తవానికి ఏదైనా సినిమా మంచి సక్సెస్ సాధించిన జంట తిరిగి కలిసి సినిమా చేస్తుందేమో కానీ వెంటనే కాదు.. కాస్త టైం తీసుకుని చేస్తూ ఉంటుంది. కానీ ఈ జంట మాత్రం వెంటనే సినిమా చేసేందుకు సిద్ధమైంది. రోషన్ శ్రీదేవి జంటగా ‘బ్యాండ్‌మేళం’ (Bandmelam) వాయిస్తారట. బ్యాండ్‌మేళం ఏంటా.. అనుకుంటున్నారా? ఏమీ లేదండి.. సినిమా టైటిలే ‘బ్యాండ్‌మేళం’. దీపావళి (Diwali) సందర్భానికి ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ (BandMelam Title Glimpse)ను మేకర్స్ వదిలారు.
గ్లిమ్స్‌ను బట్టి చూస్తే.. ఈ చిత్రంలో శ్రీదేవి పక్కా తెలంగాణ అమ్మాయిలా కనిపిస్తోంది. బండి మీద రోషన్.. శ్రీదేవి ఇంటికి వస్తాడు. రాజమ్మా (శ్రీదేవి) అంటూ వెదుక్కుంటూ మేడపైకి వెళతాడు. అక్కడ శ్రీదేవి ఉంటుంది. ఆమెను చూసి ఈడున్నవా.. నీకోసం ఇల్లంతా వెదుకుతున్నా అంటాడు. అప్పుడు శ్రీదేవి ‘రాజమ్మ ఎవత్తిరా రాజమ్మ? గుణపం వేసి గుద్దుతా బావ బాడ్కవ్’ అంటుంది. ‘నువ్వట్లనకే నా గుండెకేమన్న అయితది’ అని రోషన్ అంటాడు. సరే చెప్పు ఏంది ముచ్చట అని శ్రీదేవి అడగటంతో.. ‘నీ కొరకు ఒక కొత్త ట్యూన్ కొట్టినా వింటవా..’ అంటాడు. ‘నా కొరకా.. షురూ చెయ్’ అంటుంది. ‘ఈ యాదగిరి వాయిస్తే భువనగిరి దాకా వినిపిస్తది చూడు..’ అంటూ పియానో వాయించడం మొదలు పెడతాడు. మొత్తానికి భువనగిరి కేంద్రంగా కథ సాగుతుందని అర్థమైంది. పక్కా తెలంగాణ యాసలో వీరిద్దరూ అలరించబోతున్నారు. ఈసారి ఎలాంటి కథతో రాబోతున్నారో చూడాలి. సతీష్ జవ్వాజి (Satish Javvaji) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని కోనా ఫిలిం కార్పోరేషన్ (Kona Film Corporation) బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి కుమార్ (SaiKumar) కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల