Thaman: ‘అఖండ 3’ టైటిల్ రివీల్ చేసిన తమన్..!
ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘అఖండ 2’ (Akhanda 2) మేనియా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను కాంబో అంటేనే ఎవర్‌గ్రీన్. ఈ కాంబోలో ‘అఖండ’ చిత్రం వస్తోంది అన్న సమయంలో అంతా ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘అఖండ 2’ (Akhanda 2) మేనియా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను కాంబో అంటేనే ఎవర్‌గ్రీన్. ఈ కాంబోలో ‘అఖండ’ చిత్రం వస్తోంది అన్న సమయంలో అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్యతో బోయపాటి డివోషన్‌కి పెద్ద పీట వేస్తూ సినిమా చేయగలరా? అని అవాక్కయ్యారు. కానీ సినిమా విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ‘అఖండ 2’పై అంచనాలను అమాంతం పెంచేసింది. ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ బీభత్సమైన ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ఆసక్తికర వార్త చెప్పారు. అదేంటంటే.. ‘అఖండ’ చిత్రం 5 పార్ట్‌లుగా రూపొందే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రెండు పార్టులు పూర్తయ్యాయి కాబట్టి మరో మూడు పార్టులు సైతం వచ్చే అవకాశం ఉందన్న మాట. తాజాగా ‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా మూడో పార్ట్ టైటిల్ బయటకు వచ్చేసిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. సినిమా పనులన్నీ పూర్తయ్యాయని అఖండ తాండవాన్ని చూసేందుకు అంతా సిద్ధంగా ఉండాలంటూ తమన్ ఒక ఫోటో నెట్టింట షేర్ చేశారు. ఆ ఫొటోలో స్క్రీన్‌పై ‘జై అఖండ’ అని రాసి ఉంది. అది చూసిన నెటిజన్లు.. ‘అఖండ 2’ చివరిలో మూడో భాగాన్ని అధికారికంగా ప్రకటిస్తారని దాని టైటిలే ‘జై అఖండ’ అని ఊహాగానాలకు తెరలేపారు.