Entertainment

Suyodhana: ఒక డిఫరెంట్ కథతో ‘సుయోధన’

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఛోటా కె ప్రసాద్ ఈ కథను తన దగ్గరకు పంపారని... స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించిందని తెలిపారు. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపిందన్నారు.

Suyodhana: ఒక డిఫరెంట్ కథతో ‘సుయోధన’

ఒక డిఫరెంట్ కథతో హీరో ప్రియదర్శి మరో ఆసక్తికర కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘సుయోధన’ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రయాలను ప్రారంభించింది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.

హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఛోటా కె ప్రసాద్ ఈ కథను తన దగ్గరకు పంపారని... స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించిందని తెలిపారు. ఒక మనిషి సుయోధన, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపిందన్నారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ బోసుబాబు పెద్ద బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీకి రాలేదు. కేవలం తన ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారన్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని.. ఈ కథలో ఉన్న సుయోధన క్యారెక్టర్ కోసం మేమంతా ఏకగ్రీవంగా అనుకున్న పేరు సాయికుమార్ అని ప్రియదర్శి తెలిపారు. హీరోయిన్ ద్రిషిక చందర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో సంహిత అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నానని.. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. సాయికుమార్, ప్రియదర్శి లాంటి మంచి ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించింది.

యాక్టర్ సాయికుమార్ మాట్లాడుతూ.. మీలాగే మేము కూడా థియేటర్‌లో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నామని.. తమ టీమ్‌లో మూవీ చూసి వచ్చిన వాళ్లను ఎలా ఉందని అడుగుతున్నట్టు వెల్లడించారు. ఈ మూవీని డైరెక్టర్, ప్రొడ్యూసర్ చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారన్నారు. తాను ప్రియదర్శితో కలిసి కోర్ట్ సినిమా చేశానని అది సూపర్ హిట్ అవడమే కాకుండా గద్దర్ అవార్డ్ కూడా పొందిందన్నారు. ప్రియదర్శి తనకు బిడ్డ లాంటివాడు. ఈ జనరేషన్‌లో దర్శి లాంటి మంచి నటులతో కలిసి తాను వర్క్ చేయడం సంతోషంగా ఉందన్నారు. యాక్టర్ దేవిప్రసాద్ మాట్లాడుతూ.. ‘సుయోధన’ సినిమాను స్క్రీన్ మీద చూడాలని వెయిట్ చేస్తున్నామని.. ఇందులో ఒక కొత్త తరహా కంటెంట్ ఉందన్నారు. తాను ప్రియదర్శితో ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేస్తున్నానని.. సాయికుమార్‌తో తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచీ మంచి పరిచయం ఉందన్నారు.

డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది తన తొలి చిత్రమని.. గతంలో ఎలాంటి ఎక్సిపీరియన్స్ లేదన్నారు. అయినా తనను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం ప్రొడ్యూసర్ బోసుబాబు ఇచ్చారన్నారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శిని కలిశానని.. ఆయన ఈ మూవీ చేస్తే బాగుంటుందని అనిపించిందన్నారు. స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రియదర్శి ఓకే చెప్పడంతో తనకు స్క్రిప్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ.. మా డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే మూవీ చేయాలని నిర్ణయించుకున్నామని... స్క్రిప్ట్ చదివాక మా మనసులోకి వచ్చిన మొదటి యాక్టర్ సాయికుమార్ అని తెలిపారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ అన్నీ తానై ఈ ప్రాజెక్ట్ ను నడిపించారని పేర్కొన్నారు. ఆయన సూచన మేరకే ప్రియదర్శిని అప్రోచ్ అయ్యామని.. ఆయన చాలా బాగా నటించారన్నారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్ మాట్లాడుతూ.. మూవీకి బీజీఎం చేసేప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమా చూస్తుంటామని.. ఆ క్రమంలో సాయికుమార్, ప్రియదర్శి పర్ ఫార్మెన్స్ చూసి తామంతా హ్యాపీగా ఫీలైనట్టు వెల్లడించారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రియదర్శి తనకు మంచి మిత్రుడని.. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మంచి సినిమాలు చేస్తూ గొప్ప స్థాయికి వచ్చాడన్నారు. ఈ సినిమా ఆయనకు మరింత పేరు తెస్తుందని.. అలాగే సాయికుమార్‌లోని డైలాగ్ డెలవరీని, పర్ ఫార్మెన్స్‌ను ఈ సినిమాలో ఉపయోగించుకునే అవకాశం దర్శకుడు మాధవ్‌కు దక్కడం ఆనందంగా ఉందన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 15, 2026 4:22 PM