Biggboss9: సుమన్ శెట్టి వర్సెస్ రీతూ చౌదరి.. రామూ రాథోడ్ వర్సెస్ సంజన.. బిగ్ ఫైట్..
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లో మంగళవారం నామినేషన్ల (Biggboss Naminations) పర్వం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రోమో (Biggboss Promo) వచ్చేసింది.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లో మంగళవారం నామినేషన్ల (Biggboss Naminations) పర్వం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రోమో (Biggboss Promo) వచ్చేసింది. అంతకు ముందు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందిన తనూజ (Tanuja Puttaswamy), సుమన్ శెట్టి (Suman Shetty)లను టీంలను ఎంచుకుని టాస్క్ ఆడాల్సి ఉంటుందని చెప్పారు. సుమన్ శెట్టి వచ్చేసి రామూ రాథోడ్ (Ramu Rathod), ఫ్లోరా (Flora Saini)లను ఎంపిక చేసుకోగా.. తనూజ వచ్చేసి దివ్య నికిత (Divya Nikitha), రీతూ చౌదరి (Rithu Chowdary)లను ఎంచుకుంది. ఈ రెండు టీం సభ్యులు నడుముకు తాడు కట్టుకుని దాని సాయంతో ఒక బ్లాకును తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఈ టాస్క్‌లో సుమన్ శెట్టి టీం గెలిచింది. అప్పుడు టీం నుంచి ముందుగా సుమన్ శెట్టి.. రీతూ చౌదరి (Rithu chowdary Naminated)ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.
గుడ్డు మ్యాటర్‌తో సుమన్ శెట్టి మొదలు పెట్టాడు. అసలు గుడ్డు విషయంలో తానెక్కడనున్నానంటూ రీతూ చౌదరి స్టార్ట్ చేసింది. ఇక్కడ మాటలు అక్కడ చెబుతున్నావు.. అక్కడ మాటలు ఇక్కడ చెబుతున్నావంటూ సుమన్ శెట్టి ఫైర్ (Suman Shetty Fire) అయిపోయాడు. నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావంటూ గట్టిగానే సుమన్ శెట్టి ఇచ్చి పడేశాడు. ఇక రామూ రాథోడ్ వర్సెస్ సంజన (Ramu Rathod Vs Sanjana) విషయానికి వస్తే.. ప్రతి గొడవలోనూ మీరున్నారంటూ రామూ నామినేషన్ మొదలు పెట్టాడు. ఇది చాలా సిల్లీ కామెడీ పాయింట్‌లా ఉందంటూ సంజన తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఎక్కడి నుంచి వచ్చావో కానీ ఓపిక నేర్చుకుని రా అంటూ రామూని సంజన ట్రిగ్గర్ చేసింది. దీంతో రామూ.. కించపరిచి మాట్లాడినట్టుగా ఉంది.. ఎక్కడి నుంచి వచ్చావనడమేంటి? అని రామూ పాయింట్ అందుకున్నాడు. మీరు మానిటర్‌ని అడగకుండా ఎలా కుక్ చేస్తారని రాము ప్రశ్నించాడు. మొత్తానికి సంజనాతో రామూకి.. రీతూతో సుమన్ శెట్టి మాటల యుద్ధం గట్టిగానే నడిచినట్టుంది.
ప్రజావాణి చీదిరాల